అను ఎమ్మానుయేల్ పై ఎఫెక్ట్ పడిందే

0ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే అవకాశాలు రావాలంటే భారీ స్థాయిలో క్రేజ్ ఉండాల్సిన అవసరం లేదు. కొంచెం క్రేజ్ ఉన్నా కూడా చాలు. అలాగే ఇండస్ట్రీలో మంచి వ్యక్తిగా పేరుంటే అవకాశాలు వస్తాయి. అంతే గాని అవసరం ఉన్నప్పుడు ఒక ప్రవర్తన తో ఉండి.. అవసరం తీరిన తరువాత మరొక ఆలోచనతో ఉంటే ఎవ్వరైనా సరే పెద్దగా పట్టించుకోరు. ఇండస్ట్రీలో అందరికి పరిచయాలు ఉంటాయి కాబట్టి ఛాన్సెస్ మిస్ అవ్వడానికి ఆస్కారం వుంటుంది.

ఇటీవల హాట్ బ్యూటీ అను ఇమ్మన్యుయేల్ కూడా అదే తరహాలో అవకాశాలను మిస్ చేసుకున్నట్టు టాక్ వస్తోంది. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని అమ్మడు ప్రమోషన్స్ కి అయితే పెద్దగా రావడం లేదని అందరికి తెలిసిందే. ఈ రోజుల్లో ఎంత పెద్ద హీరోయిన్ అయినా కూడా ప్రమోషన్స్ తో సినిమాకు క్రేజ్ తెస్తున్నారు. కానీ అను రీసెంట్ గా నటించిన ఒక సినిమా ప్రమోషన్స్ కి రాలేదు. అలాగే వేడుకలకు కూడా సరిగ్గా హాజరుకాలేదు. దీంతో సదరు సినిమా వాళ్లు అమ్మడి ప్రవర్తనకు అసంతృప్తిని వ్యక్తం చేశారట.

అది కాస్త ఆ నోట ఈ నోటా పాకి టాలీవుడ్ అంతా పాకేసింది. రీసెంట్ గా రవితేజ సినిమాలో అవకాశం కూడా మిస్ అయినట్లు టాక్. అమర్ అక్బర్ అంథోని సినిమా లో శ్రీను వైట్ల మెయిన్ హీరోయిన్ గా సెట్ చేద్దామని అనుకున్నప్పటికి ప్రమోషన్స్ కి అమ్మడు ఎదో ఒక కారణం చెప్పి డుమ్మా కొడుతోంది అని టాక్ రావడంతో వెంటనే ఇలియానను సెట్ చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం అను నాగ చైతన్య తో శైలజా రెడ్డి అల్లుడు అనే సినిమా చేస్తోంది. మరి ఆ సినిమాతో అయినా మంచి టాక్ తెచ్చుకుంటుందో లేదో చూడాలి.