బేబీ కెరీర్ క్లోజేనా?

0మజ్ను సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ అను ఇమ్మానుయేల్. ఆ సినిమా యావరేజ్ అని తెలినా అమ్మడి అందానికి క్రేజ్ మాత్రం బాగానే వచ్చింది. ఒక్కసారిగా కొంచెం ట్రెండ్ అవ్వడంతో నిర్మాతలు దర్శకులు అమ్మడితో వర్క్ చేయాలని కాస్త తొందరపడ్డారు. రాజ్ తరుణ్ తో చేసిన కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమా కూడా పెద్దగా ఆడలేదు. అయినా కూడా బేబీ పై కొందరికి నమ్మకం బాగానే ఏర్పడింది.

వెంటనే ఆజ్ఞతవాసి – నా పేరు సూర్య లాంటి భారీ సినిమాల్లో విజయం అందడంతో లక్కీ గర్ల్ అని అనుకున్నారు. కానీ రెండు సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో అమ్మడి బ్యాడ్ లక్ మాములుగా లేదని తేలిపోయింది. పైగా నటనలో కూడా ప్రశంసలు దక్కలేదు. ముఖ్యంగా నటనను రాబట్టే క్యారెక్టర్స్ ఆమెకు దోరకలేదని చెప్పాలి. ఇదంతా పక్కనపెడితే అమ్మడి లోపం కూడా చిత్ర వర్గాలకు తలనొప్పిగా మారిందట.

సినిమా ప్రమోషన్స్ ఉంటే అను డుమ్మా కొట్టేస్తోంది. ఇటీవల నా పేరు సూర్య ప్రమోషన్స్ లో కొంచెం కూడా పాల్గొనలేదు. అల్లు అర్జున్ అన్ని విధాలుగా సినిమాకు ప్రమోషన్స్ చేసినా కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అయినా గాని తనవంతు సహాయాన్ని అమ్మడు అందించకపోవడం గమనార్హం. ప్రస్తుతం అందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో బేబీ కెరీర్ కష్టాల్లో పడిందని టాక్ వస్తోంది. ప్రస్తుతం అను చేతిలో శైలజా రెడ్డి అల్లుడు మాత్రమే ఉంది. మరి ఆ సినిమాతో అయినా రికవర్ అవుతుందో లేదో చూడాలి.