ఆ హీరో కు ఈగో జీరో అంటున్న హీరోయిన్

0



ఈగో లేని మనిషిని చూపించడం కష్టం.. అదే ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఉండే హీరోలకు ఈగో లేదంటే నమ్మబుద్ది కాదు. కానీ ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాలో ఫుల్లుగా ఈగో ఉన్న పిల్లగా నటించిన అను ఇమ్మాన్యుయేల్ మాత్రం తన హీరో నాగ చైతన్యకు పెద్ద సర్టిఫికేట్ ఇచ్చింది. ఈగో విషయంలో చైతుకు జీరో మార్కులు ఇచ్చింది. అంటే అస్సలు ఇగో లేదట.. టాలీవుడ్ లో ఉన్న జీరో ఈగో హీరో చైతు అని చెప్పింది.

‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాలో చైతు క్యారెక్టర్ రియల్ లైఫ్ లో చైతు క్యారెక్టర్ కు అసలు తేడా లేదట. అందువల్లే చైతు ఈ సినిమా జీరో ఈగో హీరో పాత్రలో చాలా న్యాచురల్ గా కనిపించాడట. అసలు అది నటించడం అనే కంటే తన రియల్ క్యారెక్టర్ ఎలా ఉందో అలా బిహేవ్ చేసినట్టుగా ఉంది అని చైతు పై అను ప్రశంసలు కురిపించింది. సెట్ లో అందరినీ ఒకేరకంగా ట్రీట్ చేస్తాడని.. ఎవరిపై కూడా ఈగో చూపించడం గమనించలేదని చెప్పింది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే చైతు కూడా ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో ఈగో వల్ల.. యాటిట్యూడ్ చూపించడం వల్ల ఒరిగేది ఏమీ ఉండదని.. అదంతా టైమ్ వేస్ట్ వ్యవహారమని చెప్పాడు.

నిజమే.. దాదాపు పదేళ్ళ కెరీర్ లో చైతు ఎలాంటి వివాదాల్లో ఇరుక్కోలేదు. ఎవరినీ ఇబ్బందిపెట్టినట్టుగా కూడా వార్తలు రాలేదు. చైతుకు టాలీవుడ్ లో ఒక జెంటిల్ మ్యాన్ ఇమేజ్ ఉంది. మరి ఇలాంటి జీరో ఈగో హీరో కు ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమాతో 100% బ్లాక్ బస్టర్ రావాలని కోరుకుందాం.