బాపట్లలో సందడి చేసిన “అజ్ఞాతవాసి” భామ

0anu-emanueal-in-bhapatlaఅజ్ఞాతవాసి సినిమా హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్‌ మంగళవారం గుంటూరు జిల్లా బాపట్లలో సందడి చేశారు. పట్టణంలోని జీబీసీ రోడ్‌లోని కొత్త బస్టాండ్ వద్ద బీన్యూ మొబైల్ సంస్థ 40వ షోరూమ్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా బీన్యూ సంస్థ ఎండీ వైడీ బాలాజీ చౌదరి, అనూ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఆమె అభిమానులతో కలిసి సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. ఈ సందర్భంగా అనూ మాట్లాడుతూ.. బాపట్లలో ఈ షోరూమ్‌ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రేపు విడుదల కానున్న అజ్ఞాతవాసి సినిమాను ధియేటర్లలోనే చూడాలని కోరారు.