మన్మోహన్ సింగ్ సినిమా.. ఫస్ట్ లుక్!

0


భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జీవితంపై బాలీవుడ్‌లో ఓ సినిమా రూపొందిస్తున్నట్లు ఇటీవలే వార్తలు బయటికొచ్చాయి. ఈ సినిమా పేరును ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’గా ఖాయం చేశారు. మన్మోహన్‌ సింగ్ మీడియా అడ్వైజర్‌గా పనిచేసిన సంజయ్‌బారు ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్: ది మేకింగ్ అండ్ అన్‌మేకింగ్ ఆఫ్ మన్మోహన్ సింగ్’ అనే పుస్తకం రాసిన విషయం తెలిసిందే. దీని ఆధారంగానే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మన్మోహన్ సింగ్ పాత్రలో బాలీవుడ్ నటుడు అనుపమ్‌ ఖేర్ నటిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే వెల్లడించారు. దీంతో పాటు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

ఈ పోస్టర్‌లో నెరసిన గడ్డం, తలపాగా, కళ్లజోడుతో అనుపమ్ ఖేర్ అచ్చం మన్మోహన్ సింగ్‌ లానే కనిపిస్తున్నారు. సునీల్ బోహ్ర నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా ద్వారా విజయ్ రత్నాకర్ గట్టే దర్శకుడిగా అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. మన్మోహన్ సింగ్ వ్యక్తిగత జీవితం, రాజకీయంగా ఆయన ఎదుర్కొన్న ఆటుపోట్లను ఈ సినిమాలో చూపించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.The-Accidental-Prime-Minister