క్యూటీ అనుపమ అరిపించే ఎక్స్ ప్రెషన్స్

0

కుర్రబ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఎక్స్ ప్రెషన్స్ కి పేరు పెట్టగలమా? చిక్లెట్ కళ్లతో మాయ చేసినా.. బూరెబుగ్గల నడుమ బుంగమూతి పెట్టినా.. బుల్లిబుజ్జి గిల్లికజ్జాల ఎక్స్ ప్రెషన్స్ పెట్టినా తెలుగు యువత గుండెల్లో దాచుకున్నారు. గుబులు రేకెత్తించే క్యూట్ అప్పియరెన్స్ ఈ అమ్మడికే అంత బాగా కుదిరింది. మల్లూ భామలు ఎందరు ఉన్నా.. అనుపమ వేరే! అని బోయ్స్ ఫిక్సయిపోయారేనాడో. `ప్రేమమ్` సినిమా మొదలు అలా మాయ చేస్తూనే ఉంది. దురదృష్టం కొద్దీ ఇటీవల సక్సెస్ ముఖం చాటేసింది కానీ – ఈ క్యూటీ ఈపాటికే చుక్కల్లో చంద్రికలా ఎవరికీ చిక్కదే కాదేమో. `సన్నాఫ్ సత్యమూర్తి` తర్వాత అష్టా వక్రుడి శాపం వల్లనో -లేక రాహుకేతువు ఆగ్రహం వల్లనో తనకి అస్సలు ఏదీ కలిసి రావడం లేదు. ఒక్క హిట్టిస్తారనుకున్న తేజ్ – రామ్ లాంటి కుర్రాళ్లే ఆ ఒక్క హిట్టుని మ్యానేజ్ చేయలేకపోయారు. దీంతో ఒక్క ఛాన్స్ ప్లీజ్! అని అడిగే వరకూ వెళ్లింది సీన్.

అయినా సన్నివేశం ఎటు వెళ్లినా.. తన రేంజు తనకు ఉంది. దక్షిణాదిన నాలుగు భాషల్లో వందలాది సినిమాలు తీస్తున్నారు. ఒక చోట కాకపోతే ఇంకోచోట దర్శకనిర్మాతలు అవకాశాలిచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు. అలా అనుపమ ప్రస్తుతం కన్నడలో అడుగుపెట్టింది. అక్కడ ఏకంగా పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సరసన `నటసార్వభౌమ` అనే చిత్రంలో నటించింది. పవన్ వడయార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే రిలీజై సక్సెసైంది.

అనుపమ కన్నడ డెబ్యూ సక్సెస్ అంటూ ప్రచారం సాగుతోంది. ఆ హుషారులోనే అనుపమ వరుసగా ఆన్ లొకేషన్ ఫోటోల్ని అభిమానులకు షేర్ చేస్తోంది. తాజాగా కొన్ని ఫోటోల్ని పోస్ట్ చేసి ఈ ఎక్స్ ప్రెషన్ ఎలా ఉంది? అంటూ డైరెక్టర్ పవన్ వడయార్ ని అడిగింది. నేను ఇంకా సీన్ లో ఇన్వాల్వ్ అయినట్టు లేదు కదా? సీన్ బాగా రావాలంటే నాకు ఒక ఐస్క్రీమ్ కొనిపెట్టాలి..!! అంటూ ఫన్నీగా ట్వీట్ చేసింది. తనని ఇంతందంగా చూపించిన ఛాయాగ్రాహకుడు చందన్ గౌడను తెగ పొగిడేసింది. ఇకపోతే అనుపమ ఇన్ స్టా నిండా ఇలాంటి క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ బోలెడన్ని కనిపించాయి. క్యూటీ అంద చందాలు గుండెల్లో గుబులు రేకెత్తించే లెవల్లో ఉన్నాయంటే నమ్మండి!
Please Read Disclaimer