అనుపమ రూటు మార్చిందే!

0

తెలుగులో ప్రేమమ్ తో ఇక్కడి యూత్ మనసులు గెలుచుకున్న కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఆ తర్వాత శతమానం భవతి లాంటి బ్లాక్ బస్టర్స్ లో మంచి పేరు తెచ్చుకుంది. క్యూట్ గా ఒద్దికైన అందంతో ఆకట్టుకునే అనుపమ సాధారణంగా గ్లామర్ షో చేయడం కానీ ఫ్యాన్స్ కి కాస్త కిక్కిచ్చే స్టిల్స్ ఇవ్వడం కానీ చాలా అరుదు. కానీ ఎందుకనో అనుపమ కాస్త రూట్ మార్చినట్టు కనిపిస్తోంది. దానికి సాక్ష్యంగా సోషల్ మీడియాలో తన అభిమానుల కోసం పోస్ట్ చేసిన ఫొటోలే.

ఒకదాంట్లో అద్దానికి తనతో తనే ముద్దు పెడుతున్నట్టు ఇచ్చిన లిప్ లాక్ పిక్ కి ఎక్కువ లైక్స్ పడుతున్నాయి. అవతల అద్దాన్ని బదులు తమను తాము ఊహించుకుంటున్న ఫ్యాన్స్ తో పాటు మార్ఫింగ్ చేసుకుని అద్దం ప్లేస్ లో తమ ఫోటోలను పెడుతున్న వాళ్ళు కూడా లేకపోలేదు. ఇక రెండో ఫొటోలో జీన్స్ షర్ట్ ని భుజాల దగ్గర కొద్దిగా కిందకు జార్చి మొహాన్ని చూపించకుండా కేవలం కళ్ళతోనే మేజిక్ చేసిన అనుపమను చూసి అభిమానులు ఐస్ అయిపోతున్నారు. మూడో ఫొటోలో పెద్ద పూవుతో తన్మయత్వాన్ని ఎక్స్ ప్రెషన్స్ లో పలికిస్తూ అరవిరిసిన నవ్వుని చూస్తే నిలవదే మది నిలవదే అని పాడుకోవాల్సిందే.

అనుపమ పరమేశ్వరన్ ఇలా ఫోటోలోనే కాదు సినిమాలో కూడా కాస్త పట్టు సడలించినట్టు కనిపిస్తోంది. హలో గురు ప్రేమ కోసమే టీజర్ లో వెనుక నుంచి తన నడుము అందాన్ని చూపించి రామ్ ని పడేయటం యూత్ కి బాగానే కనెక్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో అనుపమ నుంచి ఇంకాస్త స్పైసి బిట్స్ ఆశించవచ్చనే అంచనాలో ఉన్నారు ఫ్యాన్స్. అనుపమ పరమేశ్వరన్ కు తెలుగులో అర్జెంటుగా హిట్ పడాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది చేసిన కృష్ణార్జున యుద్ధం తేజ్ ఐ లవ్ యు రెండు ఒకదాన్ని మించి మరొకటి డిజాస్టర్ కావడంతో తన ఆశలన్నీ హలో గురు ప్రేమ కోసమే మీదే పెట్టుకుంది. ఉన్నది ఒకటే జిందగీ తర్వాత రామ్ తో అనుపమ నటిస్తున్న మూవీ ఇది. నేను లోకల్ తో ప్రూవ్ చేసుకున్న త్రినాథ రావు దర్శకుడు కావడం దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత బ్యానర్ దీన్ని నిర్మిస్తుండటం లాంటి కారణాల వల్ల అనుపమ హోప్స్ గట్టిగానే ఉన్నాయి.
Please Read Disclaimer