బులుగులో జిలేబీ అనుప‌మ

0పాల బుగ్గ‌ల‌తో ప‌రేషాన్ చేస్తుంది.. క్రీగంటి చూపుతో గుండెను కోసేస్తుంది. స్కూల్, కాలేజ్ బోయ్స్‌కి కంటిపై కునుకే క‌రువ‌య్యేలా చేస్తోంది. అంతేనా…! బోయ్స్‌ ప్రేమ‌మ్ ప్రేమ‌మ్ అంటూ వెంట‌ప‌డ్డారు. అ…ఆ అమ్మ‌మ్మో అంటూ గిజ‌గిజ‌లాడారు. అస‌లింత‌కీ ఎవ‌ర‌బ్బా.. ఆ అందాల రాశి అంటారా.. అ ఆ సుంద‌రి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌.

అనుప‌మ కోరాలే కానీ పాల స‌ముద్రాన్ని దోసిట ప‌ట్టి తెచ్చే.. చంద‌మామ‌ను భూమికి దించే వీరాభిమానులున్నారు. త‌న‌కోసం ప‌డి చ‌చ్చేంత టీనేజీ అనుచ‌ర వ‌ర్గం ఉంది. అందుకే ఈ అమ్మ‌డు ఆడిందే ఆట‌.. పాడిందే పాట‌. అస‌లు అనుప‌మ ట్రెడిష‌న‌ల్‌గా క‌నిపించినా, క‌వ్విస్తూ క‌నిపించినా.. ఒక సాధాసీదా అమ్మాయిలా ఎలాంటి మేక‌ప్ లేకుండా క‌నిపించినా.. యూత్ మాత్రం ప‌దే ప‌దే త‌ననే క‌ల‌వ‌రిస్తున్నారు.

అలాంటిది ఇలా నీలి రంగులో క‌నిపిస్తే ఇంకేమైనా ఉందా? చూసేందుకు ప‌క్కా ట్రెడిష‌న‌ల్ లుక్ లో ఉన్నా.. యూత్ మాత్రం వేరే కోణంలోనూ అనుప‌మ‌ను చూస్తున్నారు. కాలేజీ అమ్మాయిల రోల్ మోడ‌ల్‌లా క‌నిపిస్తున్న అనుప‌మ‌.. గ్లామ‌ర్‌ని ఎలివేట్ చేయ‌డంలో కొన్ని ప‌రిమితులు పెట్టుకున్నా.. అవ‌కాశాల‌కు మాత్రం కొద‌వే లేదు. అనుప‌మ ప్ర‌స్తుతం రామ్ స‌ర‌స‌న `హ‌లో గురు ప్రేమ‌కోస‌మే`, తేజ్ స‌ర‌స‌న `తేజ్‌.. ఐ ల‌వ్ యు` చిత్రాల్లో న‌టిస్తోంది.