మరదలు పిల్ల గానకోకిలవుతుందట!

0

ముద్దుగా..బొద్దుగా ..పొట్టిగా.. ఉంటుంది.. కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెడుతుంది. అల్లరల్లరి చేస్తుంది. చూపులతో గాలం వేస్తుంది.. క్షణాలు.. సెకన్లలో వలపు దోపిడీ చేస్తుంది. ఇంతకీ ఎవరీ పిల్ల? చెప్కోండి చూద్దాం..! ఫజిల్ వేసేలోపే ఠకీమని అనుపమ పరమేశ్వరన్ అని చెప్పేస్తారేమో! అంతందంగా అంత క్యూట్గా కవ్వించే వేరొక ముద్దుగుమ్మ పరిశ్రమలో లేనేలేరంటే అతిశయోక్తి కాదు. ప్రేమమ్ చిత్రంతో తెలుగువారికి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ కథానాయికగా సెటిలవ్వకపోతే ఏమయ్యేదో తెలుసా? కచ్ఛితంగా గానకోకిల అయ్యేదే!!

అప్పట్లోనే `ప్రేమమ్` టైమ్ లో ఈ భామ పాటగత్తెగానూ తనలో ట్యాలెంట్ ఉందని చెప్పింది. మీడియా ఇంటర్వ్యూలో చిన్నా చితకా బాత్రూమ్ సింగర్ లా పాటలు పాడేది. ఇప్పుడు పెద్ద స్టార్ అయిపోయింది. ఇంతింతై అన్న చందంగా ఎదిగేసింది. ప్రస్తుతం రామ్ హీరోగా తెరకెక్కుతున్న `హలో గురు ప్రేమ కోసమే`లో నాయికగా నటిస్తోంది. త్రినాథరావు నక్కిన తెరకెక్కిస్తున్న ఈ చిత్రం శరవేగంగా నిర్మాణానంతర పనులు జరుపుకుంటుంది. ఇలాంటి వేళ అనుపమ ఓ ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర సంగతిని చెప్పింది.
Please Read Disclaimer