న్యూడ్ సీన్స్ అన్నేసి సార్లు తీసేవారట!

0షాకింగ్ విషయాన్ని వెల్లడించింది నటి కుబ్రా సైత్. ఇప్పుడు మొయిన్ స్ట్రీం సినిమాలకు ధీటుగా.. మసాలా దట్టించి మరీ వదులుతున్న వెబ్ సిరీస్ ల్ని భారీగా తెరకెక్కించటం తెలిసిందే. మొయిన్ స్ట్రీమ్ సినిమాల్లో చూపించలేని కంటెంట్ ను వెబ్ సిరీస్ పేరుతో తీయటం.. ఈ ప్రాజెక్టుల్లో అగ్రతారలు సైతం నటించేందుకు ఓకే అనటం ఈ మధ్యన వచ్చిన కొత్త ట్రెండ్.

నటీనటులే కాదు. ప్రముఖ దర్శకులు సైతం వెబ్ సిరీస్ లు చేస్తూ వార్తల్లోకి వస్తున్నారు. ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లు తీసి సక్సెస్ అయిన దర్శకులు ఉన్నారు. ఇప్పుడు ఆ కోవకే చెందుతుంది బాలీవుడ్ వెబ్ సిరీస్ స్కేర్డ్ గేమ్స్. ఈ సిరీస్ లో ఇప్పటివరకూ బాలీవుడ్ ప్రముఖ నటులు సైఫ్ అలీఖాన్.. నవాజుద్దీన్ సిద్దికీ.. రాధికా అప్టే.. కుబ్రా సైత్ లు నటించారు. 1980.. 90 నాటి ముంబయి గ్యాంగ్ స్టర్స్.. పోలీసుల మధ్య జరిగిన దాడులు.. ప్రతిదాడుల నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ ను తీస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సిరీస్ లో భాగంగా తాను పలుమార్లు న్యూడ్ సీన్స్ చేయాల్సి వచ్చిందని కుబ్రా సైత్ వెల్లడించారు. తానీ వెబ్ సిరీస్ లో కుక్కూ అనేట్రాన్స్ జెండర్ పాత్రను పోషించానని.. కొన్ని సీన్లలో నగ్నంగా కనిపించాల్సి వచ్చేదని.. ఈ విషయాన్ని దర్శకుడు అనురాగ్ కశ్యప్ ముందే చెప్పినట్లు చెప్పారు.

అయితే.. న్యూడ్ సీన్స్ తెరకెక్కించే సమయంలో ఆ సీన్లను పలుమార్లు షూట్ చేయాల్సి వచ్చేదన్నారు. సీన్ ముగిసిన ప్రతిసారీ మరో టేక్ చేద్దామని చెప్పేవారని.. అలా ఒక్కో సీన్ ఆరేడుసార్లుచేయాల్సి వచ్చేదన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనతో మాట్లాడుతూ.. నువ్వు నన్ను అసహ్యించుకుంటున్నావని నాకు తెలుసు.. కానీ అలా చేయొద్దు.. సీన్ బాగా రావటానికే అలా చేయాల్సి వచ్చిందని తనతో చెప్పేవారన్నారు.

అదే పనిగా న్యూడ్ సీన్స్ చేయాల్సి రావటం.. ఆరేడు టేకులు షూట్ చేయటంతో తాను పలుమార్లు ఏడ్చేసినట్లు ఆమె చెప్పారు. ఒక ఇంగ్లిషు మీడియాసంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. తెర మీద కనిపించే న్యూడ్ సీన్స్ చిత్రీకరణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయన్నది కుబ్రా మాటలు వింటే ఇట్టే అర్థం కాక మానదు.