స్టార్ హీరోతో అనుష్క పెళ్లి!!

0anushka-shetty-marriageకోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన సింగం సీక్వెల్ సీ3 రిలీజ్ కి రెడీ అయిపోయింది. నెల్లాళ్ల క్రితమే థియేటర్లలోకి రావాల్సిన ఈ మూవీ.. డిమానిటైజేషన్ దెబ్బకి వాయిదా పడి చివరకు జనవరి 26కు రిలీజ్ సిద్ధమైంది. సింగం సిరీస్ లో మూడో భాగంగా వస్తున్న ఈ చిత్రంలో.. అనుష్కకు ప్రమోషన్ ఇచ్చాడట దర్శకుడు హరి.

మొదటి రెండు భాగాల్లోను సూర్యకు ప్రియురాలిగానే అనుష్క కనిపిస్తుంది. మొదటి భాగంలో స్వీటీ సోలో హీరోయిన్ కాగా.. రెండో భాగంలో హన్సిక సెకండ్ హీరోయిన్ గా కనిపిస్తుంది. ఇప్పుడు మూడో భాగం కోసం శృతి హాసన్ ను తీసుకొచ్చాడు దర్శకుడు. అయితే. సీ3లో సూర్య-అనుష్కలకు పెళ్లి చేసేస్తున్నాడట దర్శకుడు. మొదటి రెండో భాగాల్లో లవర్ పాత్ర చేసిన స్వీటీ.. ఈ సారి సూర్యకు భార్యగా నటించనుందని అంటున్నారు. ఇక శృతి హాసన్ పాత్ర కూడా ఈ మూవీలో కీలకం అని తెలుస్తోంది.

కేవలం పాటల కోసం తీసుకున్న సెకండ్ హీరోయిన్ గా మాదరిగా కాకుండా.. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా శృతిహాసన్ పై ఉంటాయని తెలుస్తోంది. ఈ హై ఓల్టేజ్ యాక్షన్ మూవీలో శృతిహాసన్ ఫైటింగ్స్ కూడా చేసేస్తుందట. అనుష్కను భార్యగాను.. శృతిని యాక్షన్ భామగాను చూపించి.. హీరోయిన్స్ కేరక్టర్స్ ను బ్యాలెన్స్ చేశాడట దర్శకుడు హరి.