జంటగా కోట్లు సంపాదిస్తున్న విరుష్క

0

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పదుల సంఖ్యలో బ్రాండ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. అంబాసిడర్ గా కోట్లు సంపాదిస్తున్న విరాట్ కోహ్లీ దేశంలోనే అత్యధిక సంపాదన కలిగిన వ్యక్తుల జాబితాలో మొదటి వరుసలో ఉన్నాడు. ఇక విరాట్ భార్య అనుష్క శర్మ కూడా బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా మంచి సంపాదన కలిగి ఉంది. అనుష్క కూడా చాలా కాలంగా ఎన్నో బ్రాండ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. అనుష్క మరియు విరాట్ కోహ్లీలు పెళ్లిక ముందు నుండే పలు కంపెనీలకు కలిసి అంబాసిడర్స్ గా చేశారు. ఇద్దరు కలిసి యాడ్స్ లో నటించారు.

పెళ్లి అయిన తర్వాత వీరిద్దరి కాంబినేషన్ కు మరింత డిమాండ్ పెరిగింది. విడి విడిగా చేసే కంటే ఇద్దరు కలిసి చేస్తే పారితోషికం మరింత ఎక్కువ ఇచ్చేందుకు కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయి. ఇప్పటికే గూగుల్ డ్యూతో పాటు పలు కంపెనీలకు వీరిద్దరు కలిసి జంటగా ప్రమోటర్స్ గా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరి యాడ్స్ బుల్లి తెరపై షేక్ చేస్తున్నాయి. తాజాగా మరో ప్రతిష్టాత్మక సంస్థకు వీరిద్దరు కలిసి బ్రాండ్ అంబాసిడర్స్ గా వ్యవహరించేందుకు సిద్దం అయ్యారు.

మింత్రా.. జబాంగ్ సంస్థలు సంయుక్తంగా ఫ్యాషన్ ప్రొడక్ట్స్ ను ఈకామర్స్ ద్వారా పెద్ద ఎత్తున మార్కెటింగ్ చేసేందుకు విరాట్ కోహ్లీ మరియు అనుష్క శర్మలను బ్రాండ్ అంబాసిడర్స్ గా ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఢీల్ ఖరీదు చాలా ఎక్కువ అని సంవత్సరంకు గాను వీరిద్దరితో సదరు సంస్థ ప్రతినిధులు అగ్రిమెంట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వీరిద్దరు కలిసి చేస్తున్న కారణంగా తప్పకుండా తమ ఫ్యాషన్ ప్రొడక్ట్స్ కు మంచి మార్కెట్ ఏర్పడుతుందనే నమ్మకం కంపెనీ వారు వ్యక్తం చేస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా ఇంకా పలు సంస్థలు కూడా వీరితో చర్చలు సాగిస్తున్నారని బాలీవుడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది.
Please Read Disclaimer