కేదార్‌నాథ్ యాత్రలో అనుష్క

0హీరోకి ధీటుగా క్రేజ్ సంపాధించుకున్న స్టార్ అనుష్క. స్వీటీ సినిమా అంటే చాలు టికెట్లు ఆటోమేటి గా తెగుతాయ్. అయితే అనుష్క మాత్రం చాలా ఎంపికగా సినిమాలు చేస్తుంది. భాగమతి తర్వాత ఆమె ఏ సినిమా చేయలేదు. ఇప్పుడు తన వ్యక్తిగత జీవితానికి పూర్తి ప్రాధాన్యత ఇచ్చింది స్వీటీ. ఇందులో భాగంగా తాజాగా ఆమె కేదార్‌నాథ్ యాత్రకు వెళ్లారు.

కాలి బాట ధామానికి చేరుకొని మ‌హాశివుణ్ణి ద‌ర్శించుకున్నారు. తిరుగు ప్ర‌యాణంలో గుర్రం స‌హాయంతో 17 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణించింది స్వీటీ. అయితే అక్క‌డ అనుష్క‌ని చూసిన కొంద‌రు ఆమెతో ఫోటోలు దిగేందుకు పోటీలు ప‌డ్డారు. ప్ర‌స్తుతం అనుష్క ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. కాగా, ఆమె గౌతమ్ మీనన్ సినిమాలో నటించడానికి సిద్దమౌతున్నారు.