అనుష్క నిర్మాతల కక్కుర్తి

0ఒకప్పుడు సినిమాలు వందరోజుల పండగ జరుపుకునేవి. తర్వాత యాబైరోజులకు పడిపోయింది. ఇప్పుడు రెండు వారాలు ఆడటమే గగనం. ఎంతపెద్ద సినిమా అయితే. ఎంత పెద్ద విజయమైన. ఇప్పుడు సినిమా జీవితం కేవలం పదిరోజులే అన్నట్టుగా తయారైయింది. ఈ విషయం నిర్మాతలు కూడా గ్రహించినట్లువున్నారు. అందుకే ఇరవైరోజులు గడవకముందే సినిమాని డైరెక్ట్ గా ఇంటర్ నెట్ లోకి వదులుతున్నారు. తాజాగా భాగమతి సినిమా అమెజాన్ లోకి వచ్చేసింది

జనవరి 26న థియేటర్లలోకి వచ్చింది భాగమతి. అనుష్క లీడ్ రోల్ లో చేసిన ఈ సినిమా మంచి వసూళ్లు సాధించింది. సక్సెస్ ఫుల్ వెంచర్ అనిపించుకుంది. ఇలాంటి సినిమాను ఇంత తొందరగా అమెజాన్ ప్రైమ్ లాంటి వెబ్ స్ట్రీమింగ్ వేదికలపైకి తీసుకురావాల్సిన అవసరం ఏముందని ఇపుడు ప్రశ్న. నిజంగా ఇది ప్రేక్షకులకు తప్పుడు సంకేతాలు పంపుతుంది. హిట్ అయిన సినిమాని కూడా ఇలా నెల రోజులకే అమెజాన్ లో తీసుకురావడం చుస్తే ..కాస్త ఓపిక పడితే మూడో వారంలోనే సినిమాని చూడొచ్చు థియేటర్ లోకి వెళ్ళకుండా అనే సంకేతాలు పపింనట్లు అవుతుంది కదా. ఏంటో భాగమతి కక్కుర్తి.!