మెగాస్టార్ తో దేవసేన జత కడుతుందట!

0తెలుగులో ఎంతోమంది హీరోలుంటారు గానీ మెగాస్టార్ ను మరిపించే స్టార్ మాత్రం ఇంకా రాలేదు. అందుకే అరవై దాటినా – మధ్యలో పదేళ్ళు సినిమాలకు దూరంగా ఉన్నా చిరు క్రేజ్ మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. ‘సైరా’ తో పాటుగా కొరటాల శివ సినిమాకు మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ జోరుగా సాగుతోంది.

సినిమాలో నటీనటులు టెక్నిషియన్స్ ఎంపిక పై కొరటాల కసరత్తు చేస్తున్నాడట. చిరు వయసును దృష్టిలో పెట్టుకుంటే సరిగ్గా సూట్ అయ్యే హీరోయిన్ ను ఎంపిక చేయడం కత్తిమీద సాము లాంటిది. అందుకే చిరంజీవి సీనియర్ హీరోయిన్లను తీసుకుందామని సూచిస్తే కొరటాల మాత్రం ఓ 30+ వయసున్న మోడల్ ను గానీ లేదా సీరియల్ నటి ని గానీ తీసుకునే ఆలోచనలో ఉన్నాడని ఈమధ్య వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం కొరటాల చిరు సలహాకే ఓటేశాడట. కొరటాల శివ ప్రభాస్ తో తెరకెక్కించిన సినిమా ‘మిర్చి’ లో అనుష్క హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ ప్రపోజల్ కు స్వీటీ వెంటనే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందట.

చూస్తుంటే మన కొరటాల శివ అత్తారింటికి దారేది లో పవన్ లా ‘ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కరెక్ట్ గా తెలిసిన’ మనిషిలా కనిపించడం లేదూ..? తెలుగురాని ముంబై బ్యూటీ ని తీసుకొచ్చి ఆమెకు యాక్టింగ్ నేర్పించి తెలుగు లో ప్రాంప్టింగ్ ఇచ్చి కష్టపడే బదులు చిరు సూచనను పాటించి స్వీటీ ని ఫైనలైజ్ చేసుకున్నాడు. స్వీటీ అయితే సూపర్ యాక్ట్రెస్.. పైగా మంచి క్రేజ్ కూడా ఉంది. ఈ సినిమా అధికారిక ప్రకటన మెగాస్టార్ పుట్టిన రోజు అయిన ఆగష్టు 22 న రానుందని టాక్.