ఫిమేల్ బ్రాండ్

0Female-Brandహీరోలకి ఉన్న బ్రాండ్ఇమేజ్ తో సినిమాలు మార్కెట్ అవడం, వాటికి కలెక్షన్లు బాగుండటం మామూలే, ఎటువంటి స్టార్ హీరో లేకుండా ఒక్క హీరోయిన్ బ్రాండ్ మీదే సినిమా మార్కెట్ అవ్వడం మామూలు విషయం కాదు, అదీ హీరోలు రాజ్యం ఏలే తెలుగుఫిల్మ్ ఇండస్ట్రీ లో. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది అనుష్క .

సెల్వరాఘవన్ డైరక్షన్ లో వస్తున్న “వర్ణ “ మూవీలో చెప్పుకోదగ్గ విశేషం ఏమిలేదు కానీ దీనిలో అనుష్క మెయిన్ రోల్ చేసింది, సినిమాని ఎలా మార్కెట్ చెయ్యాలని టెన్షన్ పడుతున్న నిర్మాతకి, తెలుగులో మంచి ఇమేజ్ వున్న అనుష్కని చూసి బయ్యర్స్ నుంచి మంచి ఆఫర్ వచ్చిందట. ఏ స్టార్ హీరో లేకపోయినా ఒక్క అనుష్క బ్రాండ్ తోనే ఆ సినిమా సేల్ అవ్వడంతో ఫ్యూచర్ ప్రొజెక్ట్స్కి అనుష్క ఎట్రాక్షన్ కానుంది. ఎట్లాంటి కారక్టర్ నైనా అవలీలగా పోషించగల అనుష్క గతంలో అరుంధతి, పంచాక్షరి వంటి సినిమాలతో తనకంటూ బ్రాండ్ ఇమేజ్ ని కైవసం చేసుకొంది.