ముద్దులతో మురిపిస్తుందట!

0

Anushka-newకన్నడ కస్తూరి అనుష్క రూటే సపరేటు. కథకు ఏది అవసరమయితే అది చేయడానికి ఏ మాత్రం వెనకాడదు. అందుకే తక్కువకాలంలోనే మంచి నటిగా గుర్తింపును తెచ్చుకుంది. ఇదివరకు `బిల్లా`లో బికినీ వేసి మురిపించింది అనుష్క. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ముద్దు సన్నివేశాలు చేసేసింది. `వర్ణ` సినిమాకోసం తమిళ కథానాయకుడు ఆర్యని ఘాడంగా ముద్దు పెట్టుకుంది. ఆ సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది.

వచ్చే నెలలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఇది జార్జియా నేపథ్యంలో సాగే కథ అని సమాచారం. భారీస్థాయి గ్రాఫిక్స్ సన్నివేశాలు ఉన్నాయట. అనుష్క పాత్ర రెండు కోణాల్లో సాగుతుందట. ఆమె ఈ సినిమాకోసం యుద్ధవిద్యలు కూడా నేర్చుకుంది. ఇందులో భావోద్రేకంతో కూడిన ఓ సన్నివేశం ఉందట. అందులో తప్పకుండా ముద్దు ఉండాలని దర్శకుడు చెప్పాడట. అందుకు అనుష్క కూడా ఒప్పుకుని చేసేసిందట. ఆ సన్నివేశం చాలా బాగుంటుందని అంటున్నారు. జేజమ్మ ఆధర చుంబనాన్ని ఆస్వాదించడానికి మీరు రెడీనా?

Tags : Anushka Kiss Scenes in Varna , Anushka and Aarya Romantic kiss scenes in varna, Anushka shetty in tamil, Anushka and Aarya love affair, Anushka hot in Tamil movies,
Please Read Disclaimer