నయనతారగా మారుతున్న అనుష్క!

0ఒకప్పుడు లేడి ఓరియెంటెడ్ సినిమా అంటే పెద్దగా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కాదు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా విజయశాంతి ప్రధాన పాత్రలో ‘కర్తవ్యం’ లాంటి సినిమా వచ్చి అందరి మైండ్ సెట్ ను మార్చింది. ఆ తర్వాత ఎన్నో లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి ఆమె లేడీ అమితాబ్ అని బిరుదు కూడా తెచ్చుకుంది. సౌత్ వరకూ చూస్తే ఆ రేంజ్ లో మళ్ళీ లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ పేరు తెచ్చుకుంది ఒక్క నయనతార మాత్రమే. తమిళనాడులో నయనతార స్టార్డం ఇప్పుడు పీక్స్ లో ఉంది.. జస్ట్ ఆమె పేరుంటే చాలు సినిమాకు బిజినెస్ అవుతోంది.

ఇప్పుడు తెలుగులో నయనతార కూడా అలాంటి దారిలోనే పయనిస్తున్నట్టుగా ఉంది. ఇప్పటికే అనుష్క’అరుంధతి.. ‘పంచాక్షరి’.. ‘రుద్రమదేవి’.. ‘వర్ణ’.. ..`జీరో సైజ్`…. ‘భాగమతి’ ఇలా చాలా లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించింది. అందులో మెజారిటీ సినిమాలు సినిమాలు హిట్లే. మళ్ళీ ఇప్పుడు అనుష్క ఒక యువ దర్శకుడు చెప్పిన లేడీ ఓరియెంటెడ్ స్టొరీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఈ సినిమాలో అనుష్కకు జోడీగా మాధవన్ నటిస్తాడట. కోన కార్పొరేషన్ – పీపుల్ మీడియా వారు ఈ సినిమాను నిర్మిస్తారని సమాచారం.

ఈ ప్రాజెక్టు మాత్రమే కాకుండా అనుష్క కోసం మరో రెండు లేడి ఓరియెంటెడ్ స్క్రిప్టులు రెడీ అవుతున్నాయట. చూస్తుంటే స్వీటీ త్వరలో తెలుగు నయనతారగా మారేలా ఉంది. ఇప్పటికే చాలా సినిమాలు చేసి ఉండడం సౌత్ మొత్తం గుర్తింపు ఉండడంతో చాలామంది ఫిలిం మేకర్స్ అలాంటి సబ్జెక్ట్స్ తో స్వీటీ ఇంటి తలుపు తడుతున్నారు. మరి నయనతారలా వరసగా హిట్స్ సాధిస్తుందా లేదా అనేది తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాలి.