ఇంతకీ ఎవరి పాత్ర పోషిస్తోందబ్బా??

0కాంట్రవర్సీలకు కొదవలేని జీవితం సంజయ్ దత్ ది. అలాంటి సంజయ్ దత్ జీవితం ఆధారంగా బయోపిక్ తీస్తున్నారంటే అంతకుమించి హైప్ ఏం కావాలి సినిమాకి. అందుకనే జూన్ 29న విడుదల కాబోతున్న ఈ చిత్రమైన చాలానే అంచనాలున్నాయి. రన్బీర్ కపూర్ సంజయ్ దత్ పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. కాగా అనుష్క శర్మ కూడా ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తోంది.

రాజ్ కుమార్ హిరాని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రమోషన్స్ రేంజ్ లో ఒక్కో పాత్రను నెమ్మదిగా ప్రేక్షకులకు పరిచయం చేస్తూ వచ్చాడు రాజ్ కుమార్. అలానే అనుష్క శర్మ పోస్టర్ ను కూడా విడుదల చేశారు కానీ ఆమె ఎవరి పాత్ర లో కనిపించబోతోందో మాత్రం చెప్పలేదు. “నా ప్రియమైన స్నేహితురాలు అనుష్క.. స్పెషల్ అప్పీరన్స్ ఇవ్వబోతోంది.. ఈమె ఎవరి పాత్ర పోషించబోతోందో గెస్ చేయండి” అంటూ ట్వీట్ చేసి ప్రేక్షకుల ఆలోచనకే వదిలేశాడు దర్శకుడు.

ఇప్పటికే రన్బీర్ కపూర్ లుక్ టీజర్ ఆసక్తిని పెంచేస్తూ ఉండగా మధ్యలో అనుష్క పాత్రలో కూడా మరొక సస్పెన్స్ పెట్టి ఇలా ఆడుకుంటున్నందుకు ప్రేక్షకులు తలలు పట్టుకుంటున్నారు. సోనమ్ కపూర్ – దియా మీర్జా – కరిష్మా తన్నా – మనీషా కొయిరాలా – జిమ్ సర్బ్ – బొమన్ ఇరానీ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇంతకీ అనుష్క ఎవరి పాత్రలో కనిపిస్తుంది అని మీరు అనుకుంటున్నారు?