నెపోటిజంలో తప్పేముంది?:అనుష్క

0

బాలీవుడ్ లో నెపోటిజమ్(బంధుప్రీతి)పై కొద్ది రోజులుగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. నట వారసులే నటులుగా రాణిస్తున్నారని – బయటి వారికి తగినన్ని అవకాశాలు దక్కడం లేదని కొందరు ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే. అభిషేక్ బచ్చన్ పై ఇదే విషయంపై ట్రోలింగ్ కూడా జరగింది. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ నెపోటిజం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలో ఔట్ సైడర్స్ గా ఎంట్రీ ఇచ్చిన వారంతా అండర్ డాగ్సే నని అనుష్క సంచలన వ్యాఖ్యలు చేసింది. నెపోటిజం ప్రభావం ఔట్ సైడర్స్ పై ఎలా ఉంటుందన్న ప్రశ్నకు ఆమె అలా స్పందించింది. నెపోటిజమ్ విషయంలో స్టార్ కిడ్స్ ను తప్పుపట్టాల్సిన అవసరం లేదని అనుష్క అభిప్రాయపడింది.`సూయి ధాగా` మూవీ సక్సెస్ మీట్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అనుష్క ఈ వ్యాఖ్యలు చేసింది.

నాణేనికి రెండు వైపులున్నట్లే – అందరి జీవితాల్లో రెండు కోణాలుంటాయని తెలిపింది. స్టార్ కిడ్స్ పై ఉన్నంత ఒత్తిడి ఔట్ సైడర్స్ పై ఉండదని అంచనాలు కూడా పెద్దగా ఉండవని తెలిపింది. టాలెంట్ ప్రూవ్ చేసుకుంటే బాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకొని నిలదొక్కుకోవడం పెద్ద విషయం కాదని చెప్పింది. ఆ ఒక్క చాన్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలని తెలిపింది. స్టార్ కిడ్ అయినా ఔట్ సైడర్ అయినా….ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాల్సిందేనని – అపుడే సక్సెస్ వస్తుందని చెప్పింది. నెపోటిజమ్ గురించి మాట్లాడమంటే టైం వేస్ట్ చేయడమేనని చెప్పింది. `సూయి ధాగా` సినిమాలో అనుష్క పర్ ఫార్మన్స్ కు మంచి గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం షారూఖ్ హీరోగా తెరకెక్కుతున్న ‘జీరో’ సినిమా షూటింగ్ లో అనుష్క శర్మి బిజీగా ఉంది.
Please Read Disclaimer