అనుష్క ప్రేమలో పడిందా?

0Anushka-Shettyమూడు ప‌దులు దాటి నాలుగేళ్ళ‌యింది అనుష్క‌కు. అయినా యంగ్‌గా ఉత్సాహంగా సినిమాలు చేసుకుంటూ ముందుకుపోతోంది. ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రికీ అనుష్క పెళ్ళి గురించే ఆసక్తి. టాలీవుడ్‌ జేజమ్మ పెళ్ళి గురించి ఇప్పటికే బోలెడన్ని వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇంట్లో వాళ్ళు పెళ్ళి కొడుకుని చూశారనీ, దాదాపు ఖరారైనట్టేననీ, అనుష్క ఇప్పటికే ప్రేమలో పడిందనీ, లవ్‌ మ్యారేజ్‌ చేసుకుంటుందనీ ఇలా బోలెడన్ని వార్తలు పుట్టుకొస్తున్నాయి. వీటి మీద అనుష్కని అడిగితే, ఇంట్లో వాళ్ళు పెళ్ళి సంబంధాలు చూస్తున్న మాట నిజమేనని చెప్పింది. ప్రేమ విషయం గురించి చెబుతూ, తను ఇదివరకే ప్రేమలో ఉన్నానని తెలిపింది. తను నటించడం ప్రారంభించినప్పటి నుంచీ సినిమాలతో ప్రేమలో పడిపోయాననీ, ఇక వేరే వాళ్ళని ప్రేమించే తీరిక తనకు లేదనీ అంటోంది.

ప్రస్తుతం బాహుబలి 2 సినిమాతో బిజీగా ఉంది అనుష్క శెట్టి. తమిళంలో సూర్యకు జోడిగా సింగం 3 సినిమాలో నటించడానికి సిద్ధం అవుతోంది ఈ భామ. నేను ఎక్కడి వెళ్లినా అంతా నా పెళ్లి గురించే అడుగుతున్నారు. ఈ విషయమై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోవాలని నాకూ ఉంది. కానీ ఇప్పటి వరకు నాకు తగిన వాడు దొరకలేదు. నాకు తగిన వాడు, నన్ను ఇంప్రెస్ చేసే వాడు దొరికితే వెంటనే పెళ్లి చేసుకుంటాను’ అని అనుష్క ప్రకటించింది.

పాత్రలను అవగాహన చేసుకోవటం, వాటికి జీవం పోయడానికి శాయశక్తులా కృషి చేయడం లాంటి లక్షణాలే అనుష్కను ఒక పరిపూర్ణ నటిగా ఉన్నత స్థాయికి చేర్చాయని చెప్పొచ్చు. అయితే గతంలో అక్కినేని నాగచైతన్యకు, అనుష్కకు నిశ్చితార్థం జరిగినట్లు, వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. జేజమ్మ ఎప్పుడూ పెళ్లి పీటలు ఎక్కుతుందో చూడాలి.