అనుష్క పెళ్లికి అడ్డంకులా?

0బాహుబలి సినిమాలో దేవసేనగా బ్రహ్మాండంగా నటించి దేశంలోని ప్రేక్షకులందరి మెప్పు పొందింది టాలీవుడ్ బ్యూటీ అనుష్క. ఈ సినిమా తరవాత ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉంచిన భాగమతి సినిమా మాత్రమే కంప్లీట్ చేసింది. భాగమతి తరవాత ఇంతవరకు అనుష్క ఏ సినిమాకూ ఓకే చెప్పలేదు. స్వీటీ పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నందునే ఈ సినిమానూ ఓకే చేయడం లేదని టాలీవుడ్ లో టాక్ ఎప్పటి నుంచో ఉంది.

బాహుబలి జంట అనుష్క – ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ అప్పట్లో ఓ న్యూస్ తెగ హల్ చల్ చేసింది. ఇది ఉట్టి రూమరేనని.. తామిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే అంటూ వాళ్లిద్దరూ తేల్చిచెప్పేశారు. తాజాగా అనుష్కను తీసుకుని ఆమె తల్లిదండ్రులు హిమాలయాల్లోని గుళ్లన్నీ తిరిగి వచ్చారట. ఈ ఏడాది చివరిలోగా అనుష్క పెళ్లి చేసేయాలని ఆమె తల్లిదండ్రులు గట్టి పట్టుదలతోనే ఉన్నారని సన్నిహితులు చెబుతున్నారు. అందుకే పెళ్లికి ఎదురవుతున్న అడ్డంకులన్నీ తొలగిపోవాలని స్వీటీని తీసుకుని మరీ ఈ ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లారని తెలిసింది. కొన్ని గుళ్లలో ఇందుకోసం ప్రత్యేకంగా పూజలు కూడా చేయించారట.

అనుష్క – ఆమె తల్లిదండ్రులు ఈ యాత్ర చేసింది స్వీటీ పెళ్లి కోసమా.. లేక ప్రభాస్ తో పెళ్లి కావడం కోసమా అన్నమాట ఫ్యాన్స్ నుంచే వినిపిస్తోంది. తెరపై సూపర్ హిట్ అయిన జంట నిజజీవితంలోనూ ఒకటి కావాలని కోరుకునే అభిమానులకేం కొరత లేదు. అనుష్కకు కాబోయే మిస్టర్ పర్ ఫెక్ట్ ఎవరో తేలాలంటే ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే.