వాట్ – స్వీటీతో సమంతా సీక్వెలా

0కొన్ని ప్రేమ కథలు సినిమా చరిత్రలో అలా నిలిచిపోతాయి. వాటికి టైం ఫ్రేమ్ అంటూ ఉండదు. ఎప్పుడు చూసినా అదే ఫ్రెష్ ఫీలింగ్ కలిగిస్తూ కొత్త అనుభూతిని పంచుతూ ఉంటాయి. నాగార్జునకు గీతాంజలి అలా ఎవర్ గ్రీన్ మెమరీగా నిలిచిపోగా నాగచైతన్యతో పాటు సమంతాకు ఏ మాయ చేసావే అంతకు మించిన బంధాన్ని కానుకగా ఇచ్చింది. గౌతమ్ తీర్చిద్దిన ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ ని మరిపించే స్థాయిలో ఆయనే మరో సినిమా తీయలేకపోయారంటేనే చెప్పొచ్చు దాని ప్రభావం ఏ స్థాయిలో ఉందొ. ఇప్పుడు దీనికి సీక్వెల్ ప్రయత్నాలు మొదలయ్యాయని కోలీవుడ్ టాక్. తమిళ్ వెర్షన్ మొదటి భాగంలో నటించిన శింబునే సెకండ్ పార్ట్ లో ఉంటాడట. తెలుగుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మన పక్క సమంతా నటిస్తే అక్కడ త్రిష మరిపించింది. తాజా టాక్ ప్రకారం ఏ మాయ చేసావే తమిళ సీక్వెల్ వినతాండి వరువాయ 2 కోసం స్వీటీ అనుష్కను హీరోయిన్ గా అనుకుంటున్నాడట గౌతమ్.

ఇదే ఇప్పుడు షాక్ కి గురి చేస్తోంది. అనుష్కకు గ్లామర్ పరంగా లోటు లేకపోయినా సెన్సిబుల్ లవ్ స్టోరీస్ కి కావాల్సిన సున్నితత్వం తనలో ఇప్పుడు తగ్గింది. అది బాహుబలి ప్రభావం కావొచ్చు లేదా అరుంధతి భాగమతి లాంటి సినిమాల ఎఫెక్ట్ కావొచ్చు తన ఇమేజ్ ప్రేక్షకుల దృష్ఠిలో వేరుగా ఉంది. అలాంటప్పుడు ఏ మాయ చేసావే లాంటి ఫ్రెష్ లవ్ స్టోరీస్ కు తను ఎంత వరకు సెట్ అవుతుంది అనేది అనుమానమే. గౌతమ్ అనుష్క పట్ల ఆసక్తి చూపడానికి కారణం ఉంది. ఈ ఇద్దరు గతంలో అజిత్ ఎంతవాడు గాని కోసం కలిసి పనిచేసారు. ఆ టైంలో గౌతమ్ అనుష్క గురించి ప్రత్యేకంగా కంప్లిమెంట్స్ ఇచ్చాడు. అప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో అనుష్కతో మరో సినిమా ఉంటుందని కూడా అన్నాడు. సో ఆ మాట నిలబెట్టుకోవడం కోసం గౌతమ్ ఏ మాయ చేసావే సీక్వెల్ కోసం అనుష్కను ఛాయస్ గా పెట్టుకున్నాడా అనేది కొద్దిరోజులు ఆగక కానీ క్లారిటీ రాదు.