అప్పట్లో అనుష్క అలా..

0ఇప్పుడు బాహుబలి 2 సినిమా కొత్త పోస్టర్ ఒకటి వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ అనుష్క శెట్టి.. దేవసేన అనే రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తొలి భాగంలో కేవలం ముఖానికి మసిపూసుకుని వృద్దాప్యం దగ్గరపడిన భామలా కనిపించిన అనుష్క.. ఇప్పుడు 2వ భాగంలో మాత్రం చాలా గ్లామరస్ గా కనిపిస్తోంది.

ఈ పోస్టరే సాక్ష్యం.. ఒకప్పుడు అనుష్క ఎంత హాటుగా ఉండేదో. ఒకప్పుడు అన్నారేంటి అనుకుంటున్నారా? అదేనండీ.. ఈ పోస్టర్లో చూపిస్తున్న స్టిల్ ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో తీసినట్లు అయితే అనిపించట్లేదు. అనుష్క సన్నగా ఉన్నప్పుడే తీసి ఇప్పుడు పోస్టర్ రిలీజ్ చేశాని అర్ధమవుతోంది. అయితే ఇప్పుడు అనుష్క బాగా ఒళ్లు చేసిన తరువాత కూడా ఆమెతో కొన్ని సీన్లు తీశారు కాబట్టి.. అసలు అవన్నీ వెండితెరపై ఎలా వస్తాయి అనేదే అసలు పజిల్.

భారీగా ఖర్చుపెట్టి విజువల్ ఎఫెక్ట్స్ లో అనుష్కను స్లిమ్ చేశారని అంటున్నారులే. రేపు రాత్రికి బాహుబలి రిలీజ్ అయిపోతే ఆ విషయంపై కూడా క్లారిటీ వచ్చేస్తుందిలే.Anushka-Baahubali-2