అనుష్కకి ఆ ఆలోచనే లేదట…

0anushka-shetty-bikiniటాలీవుడ్ బ్యూటీ అనుష్క శెట్టికి పలు భాషల్లో చిత్రాలు ఉన్నా.. ఈ భామ టాలీవుడ్ లో మాత్రం టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అరుంధతి చిత్రంతో మొదలైన ఈ భామ ప్రభంజనం.. రీసెంట్ గా బాహుబలి2 వరకూ కొనసాగుతూనే ఉంది. బాహుబలి పార్ట్1 లో అనుష్క కేరక్టర్ పరిమితంగా ఉన్నా.. రెండో భాగానికి మాత్రం దేవసేన పాత్రే కీలకం.

ప్రస్తుతం స్వీటీ కొత్త ప్రాజెక్టులేమీ ఇంకా సైన్ చేయడం లేదు. తన రేంజ్ కి తగిన రోల్స్ కోసం ఎదురుచూస్తోందనే ఓ టాక్ ఉంది. బాహుబలి2 తర్వాత బాలీవుడ్ జనాలు కూడా అనుష్కపై మోజు పడుతోంది. ఆమెతో ఎలాగైనా హాట్ హాట్ ఫోటో షూట్స్ చేయించేందుకు రెడీగా ఉన్నారట. ఇప్పటికే ఈమె దగ్గరకు చాలానే ప్రపోజల్స్ వచ్చాయని తెలుస్తోంది. మరి అనుష్క కాసింత లావుగా కనిపిస్తోందిగా అనుకోవచ్చు కానీ.. బాలీవుడ్ లో ఇప్పుడు నాజూకుగా మారిన అనేక మంది సుందరాగులు.. గతంలో బొద్దు భామలే అనే విషయాన్ని మర్చిపోకూడదు.

అలాగే బేగం జాన్ లో విద్యాబాలన్ చేసిన మాదిరిగా డిఫరెంట్ కేరక్టర్స్ చేయాలంటూ అనుష్కకు ప్రతిపాదనలు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. ఇప్పటివరకూ ఉత్తరాది ఎంట్రీ పై అనుష్క ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. తనను అమితంగా ఆరాధించే సౌత్ సినిమాలపైనే స్వీటీ దృష్టంతా ఉందని.. ఎంతటి క్రేజీ ఆఫర్స్ వచ్చినా.. నార్త్ లో అడుగు పెట్టే ఉద్దేశ్యం లేదని అనుష్కకు లేదని సన్నిహితుల నుంచి వినిపిస్తున్న మాట.