’22 వేట టీచర్ పోస్టుల భర్తీ’

0ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టెట్, డిఎస్సీ ని ఒకే సారి నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నామని మాధ్యమిక విద్యాశాఖా మంత్రి పార్థసారధి తెలిపారు. గుంటూరు జిల్లా మదనపల్లెలో మాట్లాడిన మంత్రి నవంబర్ లేక డిసెంబర్ లో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు.

ఈ ఏడాది డిఎస్సీలో 22 వేల టీచర్ పోస్టులను భర్తీచేస్తామని చెప్పిన పార్థసారధి, ఇప్పటికే టెట్ పరీక్షలో లక్షల మంది అర్హత సాధించారని, నేరుగా డిఎస్సీ నిర్వహిస్తే వారితో న్యాయపరమైన సమస్యలొస్తాయని తెలిపారు. త్వరలోనే న్యాయ, సాంకేతిక పరమైన సమస్యలు అధిగమించి డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. మండలానికో మోడల్ స్కూలు ఏర్పాటు చేస్తున్నామని, అందులో ఇప్పటికే 35 పాఠశాలలు పూర్తయ్యాయని తెలిపారు. ఈ ఏడాది స్కూళ్లు తెరిచేనాటికి పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉంచుతామన్నారు.

ap dsc 2013 notification district wise vacancies lists, ap dsc 2013 latest news, ap dsc 2013 updates, ap dsc 2013  notification news, ap dsc 2013 notification updates,