ఏపీ ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే..

0ఫిబ్రవరి , మార్చి నెలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ , సెకండ్ ఇయర్ పరీక్షా ఫలితాలను ఈ నెల 12 , 13 తేదీలలో విడుదల చేయబోతున్నట్లు ఏపీ ఇంటర్ బోర్డు తెలిపింది. ఏప్రిల్ 12న ఇంటర్ సెకండ్ ఇయర్ , ఏప్రిల్ 13న ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలను విడుదల చేయబోతున్నారు.

ఈ మేరకు ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి ఉదయలక్ష్మి ఏప్రిల్ 9న ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు రాజమహేంద్రవరంలో ఈ ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఫలితాలను ఏపీ ఇంటర్ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.