తెలుగురాష్ట్రాల్లో 2018లోనే ఎన్నిక‌లు..!

0Ap-telangana-elections-in-2ఏపీ, తెలంగాణ‌లో వ‌చ్చే యేడాదే సాధార‌ణ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయా ? లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ వాదనను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ ఓకే చెప్పారా ? అంటే అవున‌నే ఆన్స‌ర్ వ‌స్తోంది. మోడీ చేప‌డుతోన్న సంస్క‌ర‌ణ‌ల ఎఫెక్ట్‌తో లోక్‌స‌భ‌తో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల శాస‌న‌స‌భ‌ల‌కు ఒకేసారి ఎన్నిక‌లు జ‌ర‌పాల‌న్న మోడీ డిమాండ్ ఆచ‌ర‌ణ‌లోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

మోడీ అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే… 2018 ఆఖరులోనే లోక్‌సభకూ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకూ ఎన్నికలు జరుగుతాయి. ఇందుకు అవసరమైన రాజకీయ, రాజ్యాంగ, పరిపాలనాపరమైన కసరత్తు వేగం పుంజుకున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మోడీ ఆలోచ‌న‌కు రెండు చంద్ర‌బాబు, కేసీఆర్ ఇద్ద‌రూ కూడా ఎస్ అన్నార‌ట‌.

ఇక చంద్ర‌బాబు అయితే దీనిపై ఓపెన్‌గానే ప్ర‌క‌ట‌న చేశారు. లోక్‌స‌భ‌కు, దేశంలోని అన్ని రాష్ట్రాక‌లు ఒకేసారి ఎన్నిక‌లు జ‌రిగాలి, ఆ త‌ర్వాత ఆరు నెల‌ల్లోనే అన్ని ర‌కాల స్థానిక ఎన్నిక‌లు ముగించాల‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ విషయంలో తమకు తాముగా చొరవ తీసుకోవాల్సిన అవసరం లేదని, కేంద్రం ముందుకు కదిలితే మద్దతు ఇవ్వాలని టీడీపీ, టీఆర్‌ఎస్‌ యోచిస్తున్నట్లు తెలిసింది.

వాస్త‌వానికి తెలుగు రాష్ట్రాల్లో 1999, 2004లో రాష్ట్రం క‌లిసి ఉన్న‌ప్పుడు, 2014లో రెండు రాష్ట్రాలుగా విడిపోయిన‌ప్పుడు లోక్‌స‌భ‌కు, శాస‌న‌స‌భ‌కు ఒకేసారి ఎన్నిక‌లు జ‌రిగాయి. ఇక ఈ రెండు రాష్ట్రాలు 2018 చివ‌ర్లో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లినా వీళ్ల అధికార కాలపరిమితిలో పెద్దగా ‘కోత’ పడదు. ఆరు నుంచి 8 నెలల ముందు మాత్రమే ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.