గ్రూప్‌ – 2 ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల ఫలితాలు

0గ్రూప్‌ – 2 ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఏప్రిల్‌ 2 నుంచి నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు కంప్యూటర్‌ పరీక్ష జరగనుందని, కంప్యూటర్‌ పరీక్ష తరువాత నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల ఫలితాలు విడుదల చేయడం జరుగుతుందని ఏపీపీఎస్సీ తెలిపింది.

మొత్తం 442 పోస్టులకు జోన్ల వారీగా ఎంపికైన అభ్యర్థుల నంబర్లను www.psc.ap.gov.in వెబ్‌సైట్లో ప్రదర్శించింది. ఏప్రిల్‌లో కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ నిర్వహించిన అనంతరం 540 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు సెలక్షన్‌ లిస్టును విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్‌ పిన్నమనేని ఉదయభాస్కర్‌ తెలిపారు.