ఆక్వామేన్ మైండ్ బ్లో

0

సముద్రంలో సొరచేపలా ఈదుతాడు… భారీ యుద్ధాలకు సిద్ధమవుతాడు.. కెరటాల్ని ఆయుధాలుగా మార్చగలడు.. నీటి బొట్టుతో ప్రపంచాన్ని చుట్టేసే విలయాన్నే సృష్టించగలడు. నీటుగాడు.. పోటుగాడు.. అందగాడు.. కన్యల పాలిట రొమాంటిక్ గయ్ .. అతడే ఆక్వామేన్! సముద్రంలో సబ్ మెరైన్ లా దూసుకుపోతాడు. మునకలేసే 1000 టన్నుల సబ్ మెరైన్ ని ఒంటి చేత్తో భుజం పైకి ఎత్తి గాల్లోకి లేపేస్తాడు. అతడి శక్తి అసాధారణం.. అనన్య సామాన్యం.

ఆకాశం నుంచి దిగి వచ్చిన రోబో మ్యాన్ లను సైతం మట్టి కరిపించే దమ్మున్నవాడు ఆక్వామేన్. ఇదివరకూ రిలీజైన ఆక్వామేన్ సినిమా సంచలన విజయం సాధించింది. 3డి విన్యాసాలతో ఆ చిత్రం కట్టిపడేసింది. ఇక అవెంజర్స్ 2లో ఆక్వామేన్ విన్యాసాలు కళ్లకు మిరుమిట్లు గొలిపాయి. భీకర భయానక భీభత్సమైన పోరాట సన్నివేశాల్లో ఆక్వామేన్ బలం చూశాం. ఈవిల్ పవర్ తో పోరాడే సముద్రపు సూపర్ మేన్ లా విరుచుకుపడే అతడి విన్యాసాలు ఫెంటాస్టిక్ అనాల్సిందే.

ఇదిగో డిసెంబర్ 21న ఆక్వామేన్ – ఎక్స్ టెండెడ్ గ్లింప్స్ చూడబోతున్నాం. ఇది సీక్వెల్ సినిమా. ఇది కేవలం ఆంగ్లంలో మాత్రమే కాదు… తెలుగు – తమిళ్ – హిందీ అన్ని లోకల్ భాషల్లోకి అనువాదమవుతోంది. ఆ క్రమంలోనే 5నిమిషాల 33 సెకెన్ల నిడివితో భారీ వీడియోనే రిలీజ్ చేశారు. ప్రఖ్యాత క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ఆక్వామేన్ -ఎక్స్ టెండెడ్ వివరాల్ని అందించారు. ఈ భారీ 3డి విజువల్ బొనాంజ .. ఇండియా నుంచి మరో రూ.300- 500 కోట్లు కొల్లగొట్టడం ఖాయమేనని భావించవచ్చు. ఐదున్నర నిమిషాల ఈ విడియో మైండ్ బ్లో అనకుండా ఉండలేరు.. వీఎఫ్ ఎక్స్ మిరాకిల్స్ కి మచ్చు తునక ఈ వీడియో. మీరు కూడా చూడండిక్కడ.
Please Read Disclaimer