‘సర్కార్’ విజయ్ లైఫ్ స్టోరి

0

సౌత్‌లో రిలీజ్‌కి వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీగా విజయ్ `సర్కార్` పేరు మార్మోగుతుంది. ఏ.ఆర్.మురుగదాస్ లాంటి ట్యాలెంటెడ్ డైరెక్టర్ ఈ ప్రాజెక్టును టేకప్ చేయగానే సక్సెస్ ఖాయమేనన్న ముచ్చటా సాగింది. పైగా విజయ్- మురుగదాస్ లకు ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్ తోడవ్వడంతో అంచనాలు మరింత పీక్స్ కు చేరాయి. ఈ కాంబినేషన్ మూవీ నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కి రానుంది. విజయ్ `మెర్సల్` తెలుగులోనూ చక్కని వసూళ్లు సాధించిన నేపథ్యంలో `తుపాకి` కాంబినేషన్ పై ఇక్కడా భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టే తెలుగు రాష్ట్రాల్లో భారీ రిలీజ్ కి ప్లాన్ చేసే ఛాన్సుందన్న టాక్ వినిపిస్తోంది.

నిన్న సాయంత్రం చెన్నయ్‌లో సర్కార్ తమిళ ఆడియో ఈవెంట్ లో మురుగదాస్ పలు ఆసక్తికర సంగతుల్ని రివీల్ చేశారు. మురుగదాస్ మాట్లాడుతూ -“విజయ్ తుప్పాక్కి – కత్తి చిత్రాలతో నటుడిగా నా అంచనాల్ని దాటేశాడు. సర్కార్ తో మరో లెవల్ ని టచ్ చేయబోతున్నాడు. అతడి పాత్ర నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. విజయ్ రియల్ లైఫ్ లో కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేయబోతున్నాడు. అతడు ఏం ఎదుర్కోబోతున్నాడో అదే తెరపై చూపించాం. అతడి వ్యక్తిగత జీవితం తెరపై కనిపిస్తుంది. విజయ్ తనకు తానుగానే బైక్ డ్రైవ్ చేసుకుంటూ ట్యూటి కార్న్ – స్టెరిలైట్ కిల్లింగ్స్ సమస్యను పరిశీలించేందుకు వెళ్లాడు“ అని తెలిపారు.

తుప్పాక్కి(తుపాకి-తెలుగు)లో తీవ్రవాదుల్ని అంతం చేసే పవర్ ఫుల్ ఆర్మీ అధికారిగా నటించిన విజయ్ – అటుపై `కత్తి` చిత్రంలో రైతు సమస్యల్ని పరిష్కరించే కార్పొరెట్ వ్యతిరేకిగా – విప్లవకారుడిగా కనిపించాడు. `కత్తి`లో ఎస్ ఈజెడ్ నేపథ్యం తమిళనాడులో ప్రకంపనాలే సృష్టించింది. ఈసారి అంతకుమించి వివాదాల్ని `సర్కార్`లో టచ్ చేస్తున్నారని మురుగ మాటల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. వివాదంతో ప్రచారం `మెర్సల్`కి కలిసొచ్చినట్టే కలిసొస్తుందేమో చూడాలి!!
Please Read Disclaimer