గ్రామీ అవార్డ్స్ 2019 .. రెహమాన్ – పీసీ గెస్ట్స్

0

ఆస్కార్ గ్రహీత.. స్వరమాంత్రికుడు ఏ.ఆర్.రెహమాన్ మూడు దశాబ్ధాల సుదీర్ఘమైన కెరీర్ లో ఎన్నో గ్రామీలు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది 61వ గ్రామీ ఉత్సవాల్లో అతడు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. నేటి సాయంత్రం లాస్ ఏంజెల్స్ (కాలిఫోర్నియా) స్టాపుల్స్ సెంటర్ లో జరగనున్న ఈ ఉత్సవంలో ఏ.ఆర్.రెహమాన్ తో పాటు ఆయన కుమార్తె రహీమా రెహమాన్ – ఇతర కుటుంబ సభ్యులు పాల్గొంటున్నారు. ఇప్పటికే వెన్యూ నుంచి రెహమాన్ కొన్ని లైవ్ ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో అభిమానులకు షేర్ చేశారు. ఈ ఫోటోల్లో రెహమాన్ కుమార్తె సహా తనతో పాటే ఉన్న ఇతర సెలబ్రిటీలు కనిపించారు.

ఈసారి గ్రామీల్లో ప్రఖ్యాత పాప్ గాయనీ గాయకులు మిలీ సైరస్ – లేడీ గాగ – కార్డీ బీ – డ్రేక్ వంటి ప్రముఖులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఇప్పటికే వీళ్లంతా లాస్ ఏంజెల్స్ కి చేరుకున్నారని తెలుస్తోంది. సుస్వరాల సంగీత ప్రపంచంలో 52ఏళ్ల రెహమాన్ అందుకోని ఎత్తు లేదు. అతడు ఇంకా ఇంకా ఉన్నత స్థానం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇటీవల తమిళ చిత్రాలకు సంగీతం అందిస్తూ స్పీడ్ పెంచిన రెహమాన్ మరోవైపు ప్రపంచ యవనికపై పలు లైవ్ ఈవెంట్లు నిర్వహిస్తూ ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని ఓలలాడిస్తున్నారు.

ఏ.ఆర్.రెహమాన్ – ఆయన కుమార్తె రహీమా రెహమాన్ గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్నారు. రెహమాన్ రహీమాలపై ఇటీవలే నెటిజనులు ట్రోల్స్ చేశారు. ఆస్కార్ విన్నింగ్ మూవీ `స్లమ్ డాగ్ మిలియనీర్` 10 సంవత్సరాల వేడుకలో పాల్గొన్న రహీమా బుర్కా ధరించి కనిపించడంతో ఆ ఫోటోపై నెటిజనులు సామాజిక మాధ్యమాల్లో తీవ్రంగా కామెంట్లు చేశారు. దానికి ప్రతిగా ఏ.ఆర్.రెహమాన్ ఆ ట్రోల్స్ కి తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. `ఫ్రీడమ్ టు ఛూజ్` అన్న ఒకే ఒక్క రిప్లయ్ తో మనసు దోచారు. ఇక సామాజిక మాధ్యమాల్లో రహీమా రెహమాన్ ఎంతో హుందాగా ఆన్సర్ ఇవ్వడం చర్చకొచ్చింది. నేటి సాయంత్రం జరుగుతున్న గ్రామీ ఉత్సవాల్లో ఏ.ఆర్.రెహమాన్ తో పాటు భారతదేశం తరపున స్పెషల్ గెస్ట్ గా లండన్ కోడలు ప్రియాంక చోప్రా ఎటెండ్ అవుతున్నారు. పీసీతో పాటు నిక్ జోనాస్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడట.
Please Read Disclaimer