ఆ నటుడిని కూడా పురుగు కుట్టింది

0

ఒక సినిమాకు సంబంధించి అత్యున్నత స్థానం దర్శకుడిదే. అందుకే డైరెక్టర్ని కెప్టెన్ ఆఫ్ ద షిప్. ఎవరెంత చేసినా ఒక సినిమా ఫలితంలో మేజర్ క్రెడిట్ దర్శకుడిదే. కాబట్టి ఆ అత్యున్నత స్థానాన్ని అందుకోవాలని చాలామంది ప్రయత్నిస్తారు. వేరే విభాగాల్లో సత్తా చాటుకున్న వాళ్లు కూడా సొంతంగా ఒక సినిమా తీయాలని తపిస్తుంటారు. ఇందుకు నటీనటులు కూడా మినహాయింపు కాదు. ఆర్టిస్టులుగా రుజువు చేసుకున్న ఎంతోమందిని దర్శకత్వ పురుగు కుట్టింది. మెగా ఫోన్ పట్టారు. కొందరు విజయవంతమయ్యారు. కొందరు ఫెయిలయ్యారు. ఫలితం ఎలా ఉంటుందో కానీ.. ఒక సినిమా అయితే తీసేయాలని తపించే వాళ్లకు కొదవుండదు. ఆ జాబితాలో ప్రముఖ నటుడు అరవింద్ స్వామి కూడా చేరాడు.

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నంతో మరే నటుడూ చేయనన్ని సినిమాలు చేసిన ఘనత అరవింద్ సొంతం. ‘దళపతి’తో మొదలుపెట్టి ‘నవాబ్’ వరకు ఏకంగా మణితో ఎనిమిది సినిమాలు చేశాడు అరవింద్. ఈ క్రమంలో అతడికి కూడా దర్శకత్వం మీద మనసు మళ్లింది. మణిరత్నం నుంచి నేర్చుకున్న విషయాలతో తాను కూడా సినిమా చేయాలని డిసైడయ్యాడు. ఇందుకోసం ఇప్పటికే మూడు కథలు సిద్ధం చేశాడట ఈ అందాల నటుడు. త్వరలోనే తన దర్శకత్వంలో ఒక ప్రాజెక్టు మొదలవుతుందని కూడా అతను వెల్లడించాడు. దాని వివరాలు తర్వాత వెల్లడిస్తానని చెప్పాడు. ఐతే దర్శకత్వం చేసినా.. నటనను మాత్రం విడిచిపెట్టనని అరవింద్ చెప్పాడు. తాను అనుకోకుండా నటుడిని అయ్యానని.. ఒకసారి మేకప్ వేసుకున్నాక తన వృత్తిని ప్రేమించానని.. ఐతే స్టార్ డమ్ వచ్చాక తనకు ఇబ్బందిగా అనిపించి సినిమాలు మానేశానని.. మధ్యలో ఓ ప్రమాదం వల్ల తన రూపమే మారిపోయిందని.. చివరికి మణిరత్నం తనను బలవంతం చేసి ‘కడలి’లో నటింపజేశాడని అరవింద్ చెప్పాడు.
Please Read Disclaimer