ఎన్టీఆర్ ఇంటెన్స్ లుక్

0త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ‘అరవింద సమేత’ కు లీకుల బెడద తప్పడం లేదు. ఇప్పటికే షూటింగ్ లొకేషన్ నుండి రెండో పిక్స్ లీకయిన సంగతి తెలుసు కదా. ఒక ఫోటోలో సీమయువకుడి అవతారంలో ఉంటే.. మరో పిక్ లో జీప్ నడుపుతూ గాయపడిన నాగబాబును ఆతృతగా చూస్తూ ఉన్నాడు. ఇక మూడో పిక్ రీసెంట్ గా లీకయింది.

ఈ పిక్ లో ఎన్టీఆర్ జీప్ డ్రైవింగ్ సీట్ లో కూర్చొని తలవంచి పక్కకు చూస్తున్నాడు. సీరియస్ గానే అయినా కాస్తా దిగాలుగా ఉన్నట్టు అనిపిస్తోంది. ఏదైనా గొడవ జరిగి లా అండ్ ఆర్డర్ అస్తవ్యస్తం అయినప్పుడు పోలీస్ బెటాలియన్ దిగుతుంది కదా అలాంటి పోలీసులు ఎన్టీఆర్ జీపు వెనక ముందు గ్రీన్ టోపీలు పెట్టుకుని ఉన్నారు. వాళ్లతో పాటు జనాలు కూడా చుట్టూ మూగి ఉన్నారు. ఈ పిక్ మాత్రం సినిమాలో ఒక హై ఎమోషన్ ఉన్న సీన్ లోనిది అని మాత్రం అర్థం అవుతోంది.

మరోవైపు ఈ సినిమాను షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ రెండో వారంలోనే రిలీజ్ చేసేందుకు ఫిలిం మేకర్స్ సన్నాహాలు చేసుకుంటున్నారు. సెప్టెంబర్ 20 లోపు టాకీ పార్ట్ కంప్లీట్ చేయాలనే ప్లాన్. ఆ తర్వాత పాటల చిత్రీకరణ జరుపుతారట. ఒక పాటను మాత్రం యూరోప్ లోని ఎగ్జోటిక్ లోకేషన్స్ లో ప్లాన్ చేశారట.