చదరంగంలో తారక్ నిచ్చెనపైనే!

0

ఎన్టీఆర్ నటించిన ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ `అరవింద సమేత`. త్రివిక్రమ్ దర్శకత్వంలో రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. వ్యక్తిగత జీవితంలో ఎంతో ఎమోషన్ మధ్య తారక్ అంతే కనెక్టయ్యి నటించిన సినిమా ఇది. అందుకు తగ్గట్టే అతడి షటిల్డ్ పెర్ఫామెన్స్ జనం బ్రహ్మరథం పడుతుండడంతో తెలుగు రాష్ట్రాలు సహా ఓవర్సీస్లోనూ భారీ వసూళ్లతో రికార్డుల మోత మోగుతోంది.

ఇప్పటికే ప్రీమియర్లలో రంగస్థలం రికార్డుల్ని బ్రేక్ చేసిన ఈ చిత్రం కేవలం బుధ గురు వారాల్లోనే 1 మిలియన్ డాలర్ క్లబ్లో ప్రవేశించింది. ఆ మేరకు ప్రఖ్యాత బాలీవుడ్ క్రిటిక్ అమెరికా వసూళ్ల వివరాల్ని అందించారు. దాదాపు 200 లొకేషన్లలో రిలీజైన ఈ చిత్రం బుధవారం -790కె డాలర్లు గురువారం- 229కె డాలర్లు వసూలు చేసింది. మొత్తం 1.02 మిలియన్ డాలర్లు వసూలు చేసిందని తెలిపారు. అంటే 7.50 కోట్ల మేర ఇప్పటికే వసూలు చేసింది. అయితే అరవింద సమేత అమెరికా హక్కులు 14.4 కోట్లకు విక్రయించారు. ఈ ఆదివారం నాటికి మొత్తం ఓవర్సీస్ రికవరీ అవుతుందని అంచనా వేస్తున్నారు. అమెరికాలో మిలియన్ డాలర్ క్లబ్లో చేరినా ఇంకా కొన్ని మీడియాలు ఆ సంగతి రాయనేలేదే! అని తరణ్ ట్విట్టర్లో ప్రశ్నించారు.

ఎన్టీఆర్ లైఫ్లో ఈ నాలుగేళ్లు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. టెంపర్ – నాన్నకు ప్రేమతో – జనతా గ్యారేజ్ – జై లవకుశ – అరవింద సమేత .. వరుసగా ఐదు ఘనవిజయాలు తారక్లో రెట్టించిన ఉత్సాహం నింపాయి. మరో విజయం అందుకుంటే డబుల్ హ్యాట్రిక్ అందుకున్నట్టే. తదుపరి ఎస్.ఎస్.రాజమౌళితో భారీ మల్టీస్టారర్ ఇంకా పెద్ద ఫ్రూట్ఫుల్ రిజల్టునే ఇస్తుందనడంలో సందేహం లేదు. పాములు- నిచ్చెనల చదరంగంలో తారక్ ఒక్కో నిచ్చెన విజయవంతంగా ఎక్కుతున్నాడన్నమాట!
Please Read Disclaimer