తండ్రి ఎదుటే కూతురి రొమాన్స్!

0arjun-daughter-aishwaryaయాక్షన్ కింగ్ అర్జున్ తెలుగువారికి సుపరిచితుడు. కొద్దికాలం క్రితం తెలుగు తెర మీద తరచూ కనిపించినా.. తర్వాతి కాలంలో ఆయన పెద్దగా కనిపించలేదనే చెప్పాలి. యాక్షన్ హీరోగా మాత్రమే బాగా తెలుసిన అర్జున్ కు.. అందాల బొమ్మ లాంటి కుమార్తె ఉందని.. ఆమె (ఐశ్వర్యా) సినిమాల్లో నటిస్తున్న ముచ్చట తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలీదనే చెప్పాలి.

హీరో విశాల్ తో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వటం ద్వారా..అమ్మడికి అవకాశాలు తన్నుకొస్తాయని అందరూ అనుకున్నారు. కానీ.. అది సాధ్యం కాలేదు. ఆమె నటించిన చిత్రం (పట్టత్తుయానై)సక్సెస్ కాకపోవటంతో అమ్మడికి అవకాశాలు రాలేదు. దీంతో.. హీరోయిన్ గా చెలరేగిపోవాలనుకున్న ఆశలు తీరలేదు.దీంతో.. తండ్రితో కలిసి చిత్ర నిర్మాణ బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు.

తన ఫస్ట్ ఛాన్స్ సక్సెస్ కాకపోవటంతో..తాజాగా మరోసారి తన అదృష్టాన్నిపరీక్షించుకోవాలని భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్లూ తమిళ..కన్నడ భాషల్లో ‘కాదలిన్ పొన్ వీధియల్’ అంటూ ఒక సూపర్ లవ్ స్టోరీని తీస్తున్నారు. దీనికి యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వం చేయటం ఒక విశేషం. యాక్షన్ చిత్రాలతో దుమ్ము రేపే అర్జున్.. ఈ సినిమాలో ఫ్యూర్ లవ్ స్టోరీని తీస్తున్నారు.

లవ్ స్టోరీ అన్నాక.. రొమాన్స్ కామన్. అయితే.. ఐశ్వర్యకు పెద్ద చిక్కే ఎదురైంది. దర్శకుడిగా ఉన్న తండ్రి ఎదుట రొమాన్స్ చేయటం మా గొప్ప ఇబ్బందిగా అనిపించేదట. అయితే.. దర్శకుడి స్థానంలో ఉన్న తండ్రిని చూసి ఇబ్బందిపడకుండా ఉండేందుకు.. ఆమె తన తండ్రిని దర్శకుడిగా మాత్రమే చూడటం మొదలెట్టారట. షూటింగ్ జరిగినంత సేపు తండ్రి కేవలం దర్శకుడేనన్నట్లుగా చూడటంతో ఇబ్బంది తప్పిందని.. రొమాన్స్ ను చాలా సహజంగా వచ్చిందని చెప్పుకొచ్చింది. ఆమె నటిస్తున్న లవ్ స్టోరీలో హీరోగా శాంతను యాక్ట్ చేస్తున్నారు. మరింత కష్టపడిన తర్వాత అయినా అమ్మడికి దక్కాల్సిన ఫలితం దక్కుతుందో లేదో చూడాలి.