మలైకా పట్ల అర్జున్ కపూర్ కు ఎంత జాగ్రత్తో..!

0

సుదీర్ఘ వైవాహిక జీవితాన్ని గడిపిన అర్బాజ్ ఖాన్ మరియు మలైకా అరోరాలు గత సంవత్సరం విడిపోయిన విషయం తెల్సిందే. అధికారికంగా విడాలకు తీసుకున్న వీరిద్దరు ప్రస్తుతం వేరు వేరు లవ్ అఫైర్స్ తో ఉన్నారంటూ వార్తలు వస్తున్నారు. ముఖ్యంగా విడాకులకు కారణం అర్జున్ కపూర్ – మలైకా అరోరాల రిలేషన్ షిప్ అంటూ పుకార్లు షికార్లు చేశాయి. అప్పటి సంగతి ఏమో కాని ఇప్పుడు మాత్రం అర్జున్ కపూర్ – మలైకాలు చాలా క్లోజ్ గా ఉంటున్నారు. ఇద్దరు చెట్టా పట్టాలేసుకుని తిరగడంతో పాటు త్వరలోనే ఇద్దరు పెళ్లి చేసుకునేందుకు సిద్దం అవుతున్నట్లుగా బాలీవుడ్ మీడియాలో చాలా రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

మలైకా కంటే దాదాపు 20 ఏళ్లు చిన్నవాడు అయిన అర్జున్ కపూర్ ప్రస్తుతం ఆమెను కంటికి రెప్పలా చూసుకుంటున్నట్లుగా తాజాగా జరిగిన ఒక సంఘటనతో వెళ్లడయ్యింది. తాజాగా ముంబయిలోని ఒక రెస్టారెంట్ కు వీరు డిన్నర్ కోసం వెళ్లారు. డిన్నర్ ముగించుకుని వెళ్తున్న సమయంలో మీడియా వారికి వీరు కంట పడ్డారు. మీడియా వారితో పాటు – సాదారణ వ్యక్తులు అంతా కూడా వీరిని చూసేందుకు వచ్చారు. దాంతో మలైకా అరోరా పైకి ఎవరు రాకుండా – ఆమెతో ఫొటోలు తీసుకునేందుకు కుర్రాలు మీద పడకుండా జాగ్రత్తగా అర్జున్ కపూర్ ఆమెను అక్కడ నుండి బయటకు తీసుకు వెళ్లాడు.

ఆ సమయంలో అర్జున్ కపూర్ ఆమెను కాపాడిన విధానం సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆ వీడియో ప్రస్తుతం బాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. 20 ఏళ్ల తేడా ఉన్న ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోవడం ఖాయం అంటూ ఈ సంఘటన ద్వారా చెప్పుకోవచ్చని జాతీయ మీడియా వారు కొందరు సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసి మరీ కామెంట్స్ చేస్తున్నారు. మరి మలైకా – అర్జున్ ల పెళ్లి ఎప్పుడు జరుగుతుందో చూడాలి.
Please Read Disclaimer