అల్లుకుపోయిన మల్లె తీగ!

0బాలీవుడ్ లో ఒడుపు తెలిసిన కుర్రాడిగా అర్జున్ కపూర్ ఫేమస్. ఎంతమంది స్టార్లు ఉన్నా – నిర్మాత బోని వారసుడిగా ఈ కపూర్ బోయ్ ఆగడాలకు హద్దే లేదు. వరుసగా సినిమాల్లో నటిస్తున్నాడు. కథానాయికలతో ఎఫైర్ లలోనూ స్పీడ్ గానే ఉన్నాడు. తనకంటే డబుల్ వయసు ఉన్న మలైకా అరోరాఖాన్ తో ఎఫైర్ సాగించాడని అందువల్లనే ఆర్భాజ్ నుంచి మలైకా విడిపోయిందని ప్రచారమైంది.

అదంతా అటుంచితే అతడు యువకథానాయికలతోనూ అంతే జోరుగా వ్యవహారాలు నడిపిస్తాడన్న టాకుంది. `ఇషాక్ జాదే` చిత్రంలో తన సరసన నటించిన పరిణీతి చోప్రాతో అప్పట్లో ఎఫైర్ సాగించాడని ప్రచారమైంది. కట్ చేస్తే ఆ తర్వాత ఇద్దరూ చెరో దారిలో సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్లడంతో కొంత గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఈ జోడీ మరోసారి `నమస్తే లండన్` చిత్రంలో కలిసి నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉందీ జంట.

పనిలో పనిగా ప్రఖ్యాత `బ్రైడ్స్ మ్యాగజైన్` కవర్పేజీ కోసం జంటగా ఫోజులు ఇచ్చారు. ఇదిగో పరిణీతి వ్యవహారం చూస్తుంటే కుర్రాడిని అల్లుకుపోతున్నట్టే కనిపిస్తోంది. పొదని అల్లేసిన మల్లెతీగలా కనిపిస్తోంది పరిణీతి. అసలే పందెంకోడి లాంటి కుర్రాడు. అటువైపు స్పందన పాజిటివ్గా ఉండాలే కానీ..! ఈ ఫోటోలో ఈ ఫోజు చూసిన ఎవరికైనా ఇలాంటి సందేహాలు కలగక మానవు. పెర్ఫెక్ట్ పెయిర్ అన్న పదానికి మీనింగ్ వీళ్లే అని ఫిక్సయిపోవాల్సిందే.