పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదా?

0

బాలీవుడ్ కు చెందిన లవ్ కపుల్స్ ఒక్కరు ఒక్కరు చొప్పున భార్య భర్తలుగా మారిపోతున్న ఈ సమయంలో త్వరలోనే మలైకా అరోరా మరియు యంగ్ హీరో అర్జున్ కపూర్ లు కూడా పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. వీరిద్దరు గత రెండు మూడు సంవత్సరాలుగా చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారు. ముఖ్యంగా మలైకా అధికారికంగా విడాకులు తీసుకున్న తర్వాత వీరిద్దరు బాహాటంగానే కలిసి తిరుగుతున్నారు. ఇలాంటి సమయంలో అర్జున్ కపూర్ మలైకాలు పెళ్లి చేసుకునేందుకు సిద్దం అవుతున్నారు – జూన్ లేదా జులై నెలల్లో వీరి పెళ్లి ఉంటుందనే వార్తలు వస్తున్నాయి.

ప్రముఖ జాతీయ మీడియా సంస్థల్లో వీరి పెళ్లి గురించి వార్తలు వస్తున్న నేపథ్యంలో అంతా కూడా వారి పెళ్లి ఫిక్స్ అనుకున్నారు. కాని తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వస్తున్న వార్తలను మలైకా కొట్టి పారేసింది. తాజాగా అర్జున్ కపూర్ కూడా ఆ విషయమై ఒక టాక్ షోలో స్పందించాడు. మీడియాలో వస్తున్న పెళ్లి వార్తలు నిజం కాదు – నాకు ఇంకా 33 సంవత్సరాలు మాత్రమే. అప్పుడే నేను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఉందని భావించడం లేదు. పెళ్లి చేసుకోకుంటే మీ పెళ్లి వార్తలు మీడియాలో ఎలా వస్తున్నాయని ప్రశ్నించిన సమయంలో.. నా పెళ్లి వార్తల గురించి మీడియా వారే సమాధానం చెప్పాలి ఎందుకంటే నా పెళ్లి గురించిన వార్తలు క్రియేట్ చేసేది పుట్టించేది మీడియా వారే. అర్జున్ పెళ్లి వార్తలు కొట్టి వేసిన నేపథ్యంలో అసలు వీరిద్దరికి పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం సహజీవనం సాగిస్తున్న వీరిద్దరు పెళ్లి చేసుకోకుండా అలాగే కలిసి ఉన్నన్ని రోజులు కలిసి ఉండాలని భావిస్తున్నట్లుగా గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.

పుకార్లు ఒక స్థాయి వరకు భరించవచ్చు. కాని నా ఓపికను నశింపజేసి – నాకు హాని కలిగేలా చేస్తే మాత్రం పుకార్లను భరించాల్సిన అవసరం నాకు లేదు. ప్రతి సారి పుకార్లపై స్పందించేందుకు నాకు సమయం ఉండదు. సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు పుకార్లు అనేవి కామన్ అనుకుంటాను. అయితే అవి శృతి మించకూడదని మాత్రం కోరుకుంటాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇదే సమయంలో మలైకా అరోరాతో రిలేషన్ షిప్ గురించి పొడి పొడిగా స్పందించాడు. ఆమె నాకు స్పెషల్ – మన చుట్టు ఉన్న వ్యక్తులు మనను ఇష్ట పడుతున్నప్పుడు – మనం వారిని ఇష్టపడుతున్నప్పుడు సంతోషంగా ఉంటుంది. అందుకే ఆమె నా పక్కన ఉండటం వల్ల నేను నా లైఫ్ ను ఎంజాయ్ చేయగలుగుతున్నాను అంటూ అంతకు మించి మలైకా గురించి మాట్లాడేందుకు అర్జున్ ఆసక్తి చూపించలేదు.
Please Read Disclaimer