ఎప్పటికీ నీవైపే ఉంటాను.. ఇట్లు అన్నయ్య

0జాన్వి కపూర్ హీరోయిన్ గా రూపొందిన తొలి చిత్రం ధడక్.. జూలై 20న విడుదల కాబోతోంది. అందాలతార శ్రీదేవి వారసురాలిగా జాన్వి ఫిలిం ఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో.. అందరిలోనూ ఈ సినిమాపై ఆసక్తి ఉంది. అసలు మూవీ షూటింగ్ మొదలుకావడానికి ముందే హీరో హీరోయిన్ పోస్టర్లను ఇచ్చి షాక్ ఇచ్చిన టీం.. ఆ తర్వాత ఇచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్లతో ఆకట్టుకున్నారు.

ఇవాళ ధడక్ ట్రైలర్ విడుదల కానుంది. గ్రాండ్ గా ఈవెంట్ నిర్వహించి మరీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాడు నిర్మాత కరణ్ జోహార్. మరాఠీ మూవీ సైరత్ కు రీమేక్ గా.. హిందీ వెర్షన్ కు అనుగుణంగా మార్చి మరీ ఈ సినిమాను రూపొందిస్తున్నారు మేకర్స్. ట్రైలర్ ఎలా ఉంటుందా.. శ్రీదేవి కూతురు ఎలా మెప్పిస్తుందా అని ఆడియన్స్ తో పాటు.. ఆమె అభిమానులు కూడా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో జాన్వి కపూర్ సోదరుడు అర్జున్ కపూర్ కూడా ఎమోషనల్ అయిపోయాడు. ”ఈరోజుతో ట్రైలర్ వస్తోంది కాబట్టి ఇక ఆడియన్స్ లో ఎప్పటికీ ఉండిపోతావు. మొదటిగా నేను సారీ చెబుతున్నాను.. నీ పక్కనే ఉండలేకపోతున్నందుకు. కాని ఎప్పటికీ నీవైపే ఉంటాను.. డోంట్ వర్రీ” అంటూ చెప్పాడు అర్జున్

గతంలో వీరి మధ్య అంతగా సాన్నిహిత్యం లేదు కానీ.. శ్రీదేవి మరణం తర్వాత అర్జున్ కపూర్ అన్నగా తన బాధ్యతలను పూర్తిగా తీసుకున్నాడు. ఇప్పుడు ఇషాన్ ఖట్టర్- జాన్వి జంటగా నటించిన ధడక్ మూవీ ట్రైలర్ లాంఛ్ కు తాను అటెండ్ కాలేకపోతున్నాడు చాలానే ఫీలవుతున్నట్లు ట్వీట్ చేశాడు అర్జున్ కపూర్. సినిమా షూటింగ్ కారణంగా లండన్ నుంచి రాలేకపోతున్న అర్జున్.. జాన్వికి ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు అంటూ ఎమోషనల్ అయిపోయాడు.