నాన్నను ఎదురించా: అర్జన్ రెడ్డి హీరోయిన్ రియల్ స్టోరీ

0arjun-reddy-movie-actress-sఇపుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ‘అర్జున్ రెడ్డి’ సినిమా గురించిన చర్చ. ‘శివ’ తర్వాత ఆ రేంజిలో ట్రెండ్ సెట్టర్ సినిమాగా పేరు తెచ్చుకుంది. ఇక ఈ సినిమాలో నటించిన హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ శాలిని పాండేకు పెర్ఫార్మెన్స్ పరంగా మంచి పేరొచ్చింది.

విజయ్ దేవరకొండ గురించి మనకు ఇప్పటికే చాలా తెలుసు. ఇంతకు ముందు ఎవడే సుబ్రహ్మణ్యం, పెళ్లి చూపులు లాంటి హిట్ చిత్రాల్లో నటించాడు. అయితే హీరోయిన్ శాలిని పాండే గురించి చాలా మందికి తెలియదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శాలిని తన పర్సనల్ డిటేల్స్, ఈ సినిమాలో హీరోయిన్ గా రావడానికి పడ్డ కష్టాల గురించి వెల్లడించారు.

శాలిని పాండే మధ్య ప్రదేశ్‌లోని జబల్‌పూర్ అనే ఒక చిన్న సిటీకి చెందిన అమ్మాయి. ఇంజనీరింగ్ గ్రాజ్యుయేట్. తండ్రి గవర్నమెంట్ ఉద్యోగి. చిన్నతనం నుండే చదువులో చురుకు. క్లాస్ టాపర్.

తనకు చిన్నతనం నుండే హీరోయిన్ కావాలనే ఆశ ఉండేదని, ఆ ఆసక్తితోనే ఇంట్లో వాళ్లను ఒప్పించి థియేటర్ ఆర్ట్స్‌లో చేరినట్లు శాలిని పాండే వెల్లడించారు. అయితే తమ ఇంట్లో మాత్రం తాను సినిమాల వైపు వెళ్లడం ఇష్టం లేదని, తన తండ్రి ఈ విషయంలో చాలా స్ట్రిక్టుగా ఉండేవారని తెలిపారు.

నాకు ఇంజనీరింగ్ కంటే ముందే నటనా రంగంలోకి రావాలని ఉండేది. అయితే ఇంట్లో వాళ్లు ఫోర్స్ చేయడంతో పూర్తి చేశాను. అదే సమయంలో థియేటర్ ఆర్ట్స్ లో శిక్షణ పొందాను అని శాలిని తెలిపారు.

నాకు థియేటర్ ఆర్ట్స్‌లో మంచి గ్రేడ్స్ వస్తుండటంతో నా కోరిక కాదనలేక నాన్న కూడా కంటిన్యూ చేయమని చెప్పారు. కానీ సినిమాల వైపు మాత్రం అస్సలు వద్దని చెప్పారు. కానీ నాకు తెలుసు నా లక్ష్యం సినిమాలే అని….. శాలిని తెలిపారు.

ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత యాక్టింగ్ వైపు వెళతానంటే నాన్న ఒప్పుకోలేదు. ఐటీ జాబ్‌లో జాయిన్ అవ్వమని ఫోర్స్ చేశారు. అపుడు నా కల నెరవేర్చుకోవడానికి ఎలాగైనా ఇంట్లో నుండి వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యాను అని శాలిని తెలిపారు.

వారం రోజులు ముంబైలో ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వచ్చేశాను. నాన్న నాకు రిటర్న్ టికెట్స్ కూడా బుక్ చేసి ఇచ్చారు. ముంబై వచ్చిన తర్వాత ఎప్పుడొస్తున్నావు అంటూ రోజూ ఫోన్ చేసేవారు. నేను వెళ్లపోయేసరికి ఆయనే వచ్చి నన్ను తీసుకెళతానని వార్నింగ్ ఇచ్చారు. ఇదే సరైన సమయం అనుకుని నేను ఇక తిరిగి రాను అని అప్పుడే నాన్నకు ఈమెయిల్ పెట్టేశాను అని శాలిని తెలిపారు.

ముంబై నుండి నేను తిరిగి రాక పోవడంతో నాన్న రోజూ ఫోన్ చేసేవారు. ఆయన నన్ను వెతుక్కుంటూ వస్తారనే భయంతో నేను ఎక్కడ ఉంటున్నాననే విషయం చెప్పలేదు. పోలీస్ కంప్లయింట్ ఇస్తానని బెదరించారు. నేను అపుడు ఆయనకు ఒకటే చెప్పాను… నాకు 22 సంవత్సరాలు, అలా చేస్తే మీరే నన్ను టార్చర్ పెడుతున్నారని రివర్స్ కంప్లయింట్ ఇస్తానని చెప్పాను, దీంతో నాన్న చాలా బాధ పడి నువ్వు నా ఇంటికి ఎప్పటికీ తిరిగి రాకు అని మెయిల్ పెట్టారు అని శాలిని తెలిపారు.

నేను అలా అనేసరికి నాన్నతో పాటు ఇంట్లో వాళ్లు చాలా బాధ పడ్డారు. కానీ నా డ్రీమ్ నిజం చేసుకోవడానికి అలా చేయక తప్పలేదు. అప్పటికి ఇంకా అర్జున్ రెడ్డి సినిమా మొదలు కాలేదు అని శాలిని తెలిపారు.

ఇంట్లో వాళ్లకి అలా తెగేసి చెప్పి ముంబైలో ఉండిపోయాను. నా దగ్గర అపుడు అకౌంట్లో కొంత డబ్బు మాత్రమే ఉంది. దేవుడి దయ వల్ల ముంబైలో మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. ముంబైలో లివింగ్ కాస్ట్ చాలా ఎక్కువ. ఒక్కో గదిలో చాలా మంది ఇరుకుగా ఉండాల్సి వచ్చేది. డబ్బు సేవ్ చేయడానికి నడిచి వెళ్లడం, ఒక్కోసారి డిన్నర్ స్కిప్ చేయడం లాంటివిని చేసేదాన్ని అని శాలిని తెలిపారు.

ఇరుకు గదుల్లో ఉండటం ఇష్టం లేక నా స్నేహితురాలికి తెలిసిన ఇద్దరు అబ్బాయిలతో ఉండటానికి సిద్ధమయ్యాను. అప్పటికి ‘అర్జున్ రెడ్డి’ సినిమా సైన్ చేశాను. షూటింగ్ మొదలు కావడానికి ఇంకా సమయం ఉంది. 15 రోజులు అని చెప్పి పరిచయం లేని ఇద్దరు అబ్బాయిలతో 2 నెలలు ఒకే ఇంట్లో ఉన్నాను. వారు చాలా మంచి వారు. నా విషయంలో ఎలాంటి అడ్వాంటేజ్ తీసుకోలేదు. నన్ను ఒక కిడ్ లా, ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేశారు అని శాలిని తెలిపారు.

ఒకసారి నాన్న ఈ యాక్టింగ్, అదీ అని వెళితే ఎందుకూ పనికి రాకుండా పోతావు, ఏదో ఒకరోజు రోడ్డుపై అడుక్కునే పరిస్థితికి వస్తావు అని తిట్టారు. కానీ నాకు ఇందులో సర్వైవ్ అవుతాననే గట్స్ ఉన్నాయి కాబట్టే ఇవన్నీ చేయగలిగాను అని శాలిని తెలిపారు.

ఆడిషన్ సమయంలో ఇన్ని ముద్దు సీన్లు ఉంటాయని సందీప్ నాకు ముందు చెప్పలేదు. ఒక వేళ చెప్పి ఉంటే అపుడు ఒప్పుకునే దాన్ని కాదేమో. కానీ అవి స్లీజీ ముద్దు సీన్లుకావు. సాధారణంగా ఉండే ముద్దు సీన్లు కాబట్టే చేయగలిగాను అని శాలిని తెలిపారు.

ఆడిషన్ సమయంలో ఇన్ని ముద్దు సీన్లు ఉంటాయని సందీప్ నాకు ముందు చెప్పలేదు. ఒక వేళ చెప్పి ఉంటే అపుడు ఒప్పుకునే దాన్ని కాదేమో. కానీ అవి స్లీజీ ముద్దు సీన్లుకావు. సాధారణంగా ఉండే ముద్దు సీన్లు కాబట్టే చేయగలిగాను అని శాలిని తెలిపారు.

సినిమా పూర్తయిన తర్వాత ప్రీమియర్ షోకు నాన్న వచ్చారు. సినిమా చూసిన తర్వాత ఆయన హ్యాపీగా ఫీలయ్యారు. ఇపుడు ఇంట్లో అంతా హ్యాపీగా ఉన్నారు….. అని శాలిని తెలిపారు.