బూతులతో అర్జున్ రెడ్డిని చూడొచ్చు

0Arjun-Reddy-Kissing-Scenesరీసెంట్ గా వచ్చిన మూవీస్ లో అర్జున్ రెడ్డి సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఎన్ని వివాదాలు ఈ సినిమాను చుట్టుముట్టాయో అంతకు పదిరెట్లు ప్రేక్షకాదారణ దక్కించుకుంది. ఈ మూవీ డైరెక్ట్ చేసిన సందీప్ వంగాపై సెలబ్రిటీలంతా ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమాతో హీరో విజయ్ దేవరకొండ పాపులారిటీ విపరీతంగా పెరిగింది. అతడితోపాటు హీరోయిన్ షాలినీ పాండేకు కొత్త అవకాశాలను తెచ్చింది.

అర్జున్ రెడ్డి బోల్డ్ ఫిలిం కావడంతో థియేటర్లలో రిలీజ్ చేయడానికి ముందు సెన్సార్ తమ కత్తెరకు బాగానే పనిచెప్పింది. చాలా చోట్ల బూతు డైలాగుల్లో బీప్ శబ్దం వినిపించడంతోపాటు కొన్ని సీన్లకు కట్ కూడా చెప్పింది. దానికితోడు ఈ సినిమా చాలా నిడివితో తీశారు. థియేటరికల్ రిలీజ్ రైట్స్ తీసుకున్న డిస్ట్రిబ్యూటర్ల కోరిక మేరకు రిలీజ్ కు ముందు మరోసారి ఎడిట్ చేయాల్సి వచ్చింది. అప్పుడే ఈ సినిమా రన్ టైం దాదాపు 3 గంటలకు వచ్చింది. అయితే ఈ సినిమాలో ఎలాంటి కట్లు బూతులకు బీప్ శబ్దాలు లేకుండా.. ఎడిటింగ్ టేబుల్ దగ్గర తీసేసిన సీన్లతో కలిసి మొత్తం కంటిన్యూగా చూడాలని కోరుకునే వారికి ఓ అవకాశం వస్తోంది. ఈనెల 13న అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ ప్రీమియర్ అందుబాటులో ఉంటుంది.

అర్జున్ రెడ్డి సినిమాలో డైరెక్టర్ ఏం చూపించదల్చుకున్నాడో మొత్తం చూసేయొచ్చు. థియేటర్లో సెన్సార్ కటింగ్స్ బీప్ శబ్దాలతో అసహనం చెందిన వారంతా ఇప్పుడు ఎలాంటి అడ్డంకి లేకుండా బూతంతా హ్యాపీగా చూడొచ్చు. కాకుంటే మూడున్నర గంటలకు పైగా రన్ టైం ఉంటుంది కాబట్టి ఆ మేరకు తీరిక చేసుకుని సినిమా చూడటం మొదలెట్టాలి మరి.