అఫ్రిదీతో సెక్స్.. మళ్ళీ చెప్పింది

0నైటీ క్వీన్ అంటూ అర్షి ఖాన్ ను ఆడియన్స్ ముద్దుగా పిలుచుకుంటారు. ఇందుకు కారణం.. ఈ భామ బిగ్ బాస్ సీజన్ లో విపరీతంగా నైటీలు వాడేసి కనిపించడమే. తనను తాను హాట్ యాక్ట్రెస్ గా చెప్పుకునేందుకు ఏ మాత్రం సంశయించని ఈ సుందరాంగి.. వివాదాలను రాజేయడంలో కూడా బాగా ఆరితేరిపోయింది.

2015లో ఈమె చేసిన ఓ ట్వీట్ సెన్సేషనల్ అయిపోయింది. తాను పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదితో సెక్స్ చేశానని.. తామిద్దరం బాగా ఎంజాయ్ చేశామని.. అయినా తను ఎవరితో అయినా పడుకోవాలంటే.. అందుకు ఇండియన్ మీడియా అనుమతి తీసుకోవాలా అంటూ అర్షి ఖాన్ చేసిన ట్వీట్ వైరల్ అయింది. ఆ సమయంలో ఈ ట్వీట్ పై విపరీతమైన చర్చలు జరిగాయి. కొందరు తిట్టిపోశారు. మరికొందరు సపోర్ట్ చేశారు. ఆ తర్వాత కొంతకాలం పాటు ఈ వివాదాన్ని కంటిన్యూ చేసిన అర్షి ఖాన్.. ఇప్పుడు విచిత్రంగా స్పందించింది.

రీసెంట్ గా ఈ భామ రాజీవ్ ఖండేల్వాల్ నిర్వహించే టాక్ షో జాజ్ బాత్ లో పాల్గొంది. ‘నాకు ఆఫ్రిది అంటే ఎంతో గౌరవం ఉంది. ఆయన నా కోసం ఎంతో చేశారు. ఆ సమయంలో ఆయనను గురించి అలా ఓపెన్ గా ట్వీట్ చేయడం నా తప్పే. ఇలాంటి సెన్సిటివ్ అంశాల మీద అలా స్పందించకుండా ఉండాల్సింది. ఆఫ్రిది సాబ్ కు నేనంటే ఎంతో అభిమానం ఉంది’ అంటూ అప్పుడు తప్పు చేశానని ఒప్పుకుంది అర్షి ఖాన్.