రంభ లాంటి పిల్లకు ఆర్య లాంటి మొగుడొస్తే!

0

తమిళ స్టార్ హీరో ఆర్య ప్రేమవివాహం గురించి తెలిసిందే. `గజినీకాంత్` సినిమా సెట్స్ లో పరిచయమైన అందాల కథానాయిక సయేషా సైగల్ ని చూసి ఈ ముదురు బ్రహ్మచారి మనసు పారేసుకున్నాడు. ఆ క్రమంలోనే ఆ జోడీ మధ్య ప్రేమాయణంపై కోలీవుడ్ మీడియా ఆసక్తికర కథనాలు ప్రచారం చేసింది. వన్ ఫైన్ డే ఇరువైపులా పెద్దల్ని ఒప్పించి పెళ్లాడేసుకున్నారు. మొన్న ఆదివారం నాడు ఈ జంట మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. అంతకుముందు హైదరాబాద్ లో జరిగిన రిసెప్షన్ కి అల్లు అర్జున్ సంజయ్ దత్ సహా పలువురు టాప్ స్టార్లు ఎటెండయ్యారు.

తాజా సమాచారం ప్రకారం.. ఈ జోడీ చెన్నయ్ లో అదిరిపోయే రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ రిసెప్షన్ లో కొత్త జంటను పలువురు స్టార్లు ఆశీర్వదించారు. ఇక ఆర్య స్నేహితుడు విశాల్ సూర్య కార్తీ వంటి స్టార్లు కొత్త పెళ్లి కొడుక్కి బ్లెస్సింగ్ అందించారు.రిసెప్షన్ లో అందరి కళ్లు కొత్త జంటపైనే. ఈడు జోడు కుదిరింది. చూడముచ్చటగా ఉన్నారంటూ ఒకటే గుసగుసలు వినిపించాయట. సూటు బూటూ తొడుక్కున్న రాకుమారుడిలా ఉన్న ఆర్య .. ఇంద్రలోకం నుంచి దిగివచ్చిన రంభలా ఉన్న సయేషాని చూస్తూ తెగ మురిసిపోతున్నాడు. ఆ చేతి వేలికి తొడిగిన అంగుళీకాన్ని మరీ అంత తధేకంగా పరిశీలిస్తున్నాడేంటో!
Please Read Disclaimer