నాని సినిమా కాస్త గజనీకాంత్ !

0gajani‘భలే భలే మగాడివోయ్‌’ నానికి అదిరిపోయే హిట్ ఇచ్చిన ఈ సినిమా. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మతిమరుపు నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నవ్వులు పూయించింది. ఇప్పుడు ఈ సినిమా తమిళ్ లోకి వెళ్ళింది. జ్ఞానవేల్‌రాజా నిర్మాణంలో స్టూడియోగ్రీన్‌ బ్యానరుపై ఆర్య హీరోగాఈ సినిమా రీమెక్ అయ్యింది. ఈ చిత్రానికి గజనీకాంత్ అని పేరు పెట్టారు. సాయేషా కథానాయి.

‘ధర్మత్తిన్‌ తలైవన్‌’ చిత్రంలోని రజనీకాంత్‌ గెటప్‌లో ఆర్య ఉన్నట్లు ఇటీవల ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. దీనికి మంచి స్పందన వచ్చింది. ఇదిలా ఉండగా సినిమా చిత్రీకరణ కొన్నిరోజుల క్రితమే పూర్తయింది. దీంతో డబ్బింగ్‌ పనులను ప్రారంభించారు. మార్చిలో ఆడియోను విడుదల చేసి ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.