సెక్స్ వర్కర్ గా మారిన లక్స్ పాప!

0asha-sainiలక్స్ పాపా.. లక్స్ పాపా లంచ్ కొస్తావా అంటూ బాలయ్య బాబు పక్కన ఆడిపాడిన ఆశా సైనీ గుర్తుందా..? ఇప్పుడు ఫ్లోరా సైనీగా పేరు మార్చుకున్న ఈ హీరోయిన్.. సెక్స్ వర్కర్ గా మారిపోయింది. కాకపోతే.. రియల్ లైఫ్ లో కాదులెండి. శ్రీజిత్ ముఖర్జీ డైరెక్షన్ లో.. విద్యాబాలన్ లీడ్ రోల్ లో వస్తున్న బేగం జాన్ సినిమా కోసం.. మన లక్స్ పాప.. మైనా అనే గుజరాతీ గిరిజన అమ్మాయిగా నటించింది.

నగేష్ కుకునూర్ డైరెక్షన్ లో వచ్చిన ధనక్ అనే సినిమాలో నటించిన ఫ్లోరా సైనీ.. శ్రీజిత్ ముఖర్జీ కంట్లో పడింది. ధనక్ లో ఆమె నటనకు ఇంప్రెస్ అయిన శ్రీజిత్.. బేగం జాన్ లో కీలకమైన మైనా రోల్ కు ఫ్లోరా సైనీని తీసుకున్నాడు.

కెరీర్ లోనే డిఫరెంట్ రోల్ చేస్తున్న ఫ్లోరా సైనీ.. సెక్స్ వర్కర్ గా ఎలా నటిస్తుందన్నదీ.. ఇంట్రెస్టింగ్ గా మారింది.