అశోక్ , సుజనా రాజీనామాలకు ఆమోదం..

0కేంద్ర మంత్రి పదవులకు అశోక్‌గజపతి రాజు, సుజనాచౌదరిలు రాజీనామాలు చేసిన సంగతి తెల్సిందే. ఈ మేరకు వారి రాజీనామాలను రాష్ట్రపతి రాంనాథ్‌కోవింద్ కొద్దీ సేపటి క్రితం ఆమోదించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి ప్రకటన విడుదలైంది. తెలుగుదేశం పార్టీ తరఫున కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిథ్యం వహిస్తున్న పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు… శాస్త్ర, సాంకేతికశాఖ సహాయమంత్రి గా సుజనాచౌదరి లు పనిచేయడం జరిగింది.

ప్రజల మనోభావాలను గౌరవించి కేంద్రం నుంచి వైదొలగాలని తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు తామిద్దరం రాజీనామాలు చేసినట్లు ఇరువురు ప్రకటించారు. ఇద్దరితో ప్రధాని సుమారు 10 నిమిషాల పాటు సంభాషించారు. ఈ సందర్భంగా కారణాలను వారు ఆయనకు వివరించారు. ప్రభుత్వంలో పనిచేసే అవకాశం కల్పించినందుకు మోదీకి ధన్యవాదాలు తెలిపారు.