కూచిపూడి డ్యాన్స్ టు బాహుబలి

0Ashrita-Vemuganti-in-Baahubali-2బాహుబలి గురించి ఎవ్వరైనా మాట్లాడితే ప్రభాస్ అనుష్క రమ్యకృష్ణ రానా లాంటివారు గురించి చెబుతారు. బాహుబలి విజయంలో ముఖ్య పాత్రలే మాత్రమే కాదు చిన్న చిన్న పాత్రలు కూడా చాలా మందికి గుర్తిండిపోయేలా తీర్చిదిద్దారు డైరెక్టర్ రాజమౌళి. అలాంటి ఒక చిన్న పాత్రలో చేసిన అమ్మాయే ఇక్కడ ఉన్నది. పేరు ఆశ్రిత వేముగంటి.

ఈ అమ్మాయిది హైదరాబాదే. చిన్నప్పటి నుండి క్లాసికల్ డాన్స్.. ముఖ్యంగా కూచిపూడి నేర్చుకుంది. ఇప్పుడు కూడా చాలా క్లాసికల్ డాన్స్ పొగ్రామ్స్ లో డాన్స్ చేస్తుంది. అలా చేస్తున్నపుడు ఒకసారి రాజమౌళి చూశాడట. రాజమౌళికి ఆమే డాన్స్ బాగా నచ్చి ఈ సినిమాలో ఆఫర్ వచ్చింది అని చెప్పింది. వాళ్ళబాయి కార్తికేయ ఫోన్ చేసి చెప్పినప్పుడు నా ఆనందానికి అవదులు లేవు అని చెబుతోంది అశ్రిత. బాహుబలిలో అనుష్క పక్కనే కనిపించిందీమె. చేసిన చిన్న రోలైనా అందరికీ గుర్తిండిపోయే రియాక్షన్లు ఇచ్చిందీమె. అంతా బాగా మొదటి సినిమాలో ఎలా చేశారు అని అడిగితే ”డాన్స్ నటన రెండు దగ్గదగ్గరగా ఒకేటే అందుకేనేమో అలా చేయగలిగాను” అని చెప్పింది. ఇంకా అనుష్కతో పని చేయడం చాలా మంచి మెమోరీగా నా జీవితంలో గుర్తుండిపోతుంది. అంతా స్టార్ అయినా చాలా వినయంగా ఉంటారు సెట్లో. నేను మొదటి రోజు చాలా భయపడ్డాను బాహుబలి సెట్ చూసి స్టార్స్ ని చూసి తరవాత అంతా హాయిగా సాగింది.. అని తన అనుభవాలు చెప్పింది.

భానుప్రియ మంజు భార్గవి లాంటి క్లాసికల్ డాన్సర్ లు హీరోయిన్ గా చేశారు ఇంతకుముందు. మన కె. విశ్వనాధ్ సినిమాలో చాలామంది హిరోయిన్లకు క్లాసికల్ డాన్స్ వచ్చినవారే. ఇప్పుడు ఈమె తన డాన్స్ పొగ్రామ్స్ తో డాన్స్ క్లాస్సెస్ తో బాగానే బిజీగా ఉంది. మరి ముందుముందు ఎలాంటి పాత్రలు వస్తాయో చూడాలి. నాకు తగ్గ పాత్రలు వస్తే నేను రెడీ అని చాలా ఉత్సహంగా చెప్పింది.