సెల్వంను పదవి నుంచి తొలగించారు!

0sasikala-and-Panneerselvam-తమిళనాడు అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు మద్దతు ఇస్తున్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఆపార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ సిద్దం అవుతున్నారు. అయితే ఇప్పటికప్పుడు వారిని పార్టీ నుంచి బహిష్కరించరాదని నిర్ణయించారు.

శాసనసభలో జరిగే బలపరిక్షలో వారు తీసుకునే నిర్ణయాన్ని బట్టి చర్యలు తీసుకోవాలని శశికళ వేచి చూస్తున్నారని ఆమె వర్గీయులు అంటున్నారు. తొలుత పార్టీపై తిరుగుబాటు చేసిన పన్నీర్ సెల్వం నిర్వహిస్తున్న పార్టీ కోశాధికారి పదవి నుంచి ఆయన్ను తొలగించారు.

పన్నీర్ సెల్వంకు మద్దతు ఇచ్చిన పార్టీ ప్రిసీడియం చెర్మన్ మధుసూదనన్ ను పదవి నుంచి తొలగించారు. పన్నీర్ సెల్వంకు మద్దతు ఇచ్చిన ఎంపీల మీద చర్యలు తీసుకుంటామని శశికళ చెప్పారు. అయితే పన్నీర్ సెల్వం, ఆయనకు మద్దతు ఇచ్చిన మంత్రి పాండ్యరాజన్, ఐదు మంది ఎమ్మెల్యేల మీద ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు.

వారిని పార్టీ నుంచి బహిష్కరించకుండా వారి సభ్యత్వం మీద వేటు వెయ్యకుండా శాసనసభ సమావేశంలో బలపరిక్ష జరిగే వరకు వేచి చూడాలని నిర్ణయించారు. ఇప్పటికిప్పుడు వీరిపై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటే తాను ముఖ్యమంత్రి కావాలన్న ఆశయానికి ఆటంకాలు వస్తాయని శశికళ నిర్ణయించారు.

పన్నీర్ సెల్వంకు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేలకు పార్టీ విప్ లు జారీ చేసి వారిని అనర్హులుగా చేయాలని భావిస్తున్నారు. అయితే ఈ విషయంపై పన్నీర్ సెల్వం కూడా న్యాయనిపుణులతో చర్చలు జరుపుతున్నారు. ఈ విషయంలొ పన్నీర్ సెల్వంకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావని న్యాయనిపుణలు అంటున్నారు.

ఓ పార్టీ నుంచి మరో పార్టీలో చేరితో పార్టీ ఫిరాయింపు కింద శాసనసభ్యత్వాన్ని కోల్పోయేందుకు అవకాశం ఉందని, అయితే ఒకే పార్టీలో రెండు వర్గాల వారు రెండు రకాల నిర్ణయాలు తీసుకోవాల్సి ఉండటంతో ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడే అవకాశం లేదని పన్నీర్ సెల్వంకు న్యాయనిపుణులు స్పష్టం చేశారని తెలిసింది.