‘అత్తారింటికి..’ అదనపు ఆకర్షణ

0Attarintiki-Daredi-wallpapersపవన్‌కళ్యాణ్‌ హీరోగా వచ్చిన ‘అత్తారింటికి దారేది’ సినిమా అంచనాల్ని మించే విజయం సాధించింది. వసూళ్ళ ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే బాక్సాఫీస్‌ వద్ద నెంబర్‌ వన్‌ సినిమాగా నిలిచిన ‘అత్తారింటికి దారేది’ సినిమాకి సరికొత్త హంగులు అద్దింది చిత్ర యూనిట్‌.

ఈ సినిమాకి అదనంగా కొన్ని సన్నివేశాల్ని జోడిస్తూ, అక్టోబర్‌ 31 నుంచి కొత్త సన్నివేశాలతో కూడిన సినిమాని ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా చిత్ర నిర్మాత వెల్లడిరచారు. తమ సినిమా రికార్డు స్థాయి విజయాన్ని సాధించినందుకు ఆనందంగా వుందనీ, పైరసీని ప్రోత్సహించకుండా తమకు సహకరించినందుకు ప్రేక్షకులకు, పవన్‌కళ్యాణ్‌ అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌.

సెప్టెంబర్‌ 27న ‘అత్తారింటికి దారేది’ సినిమా విడుదల కాగా, దానికి మూడు రోజుల క్రితమే పైరసీ డీవీడీ బ్లాక్‌ మార్కెట్‌లోకి వచ్చేసింది.

వాస్తవానికి సినిమాని అక్టోబర్‌ 9న దసరా కానుకగా విడుదల చేయాలనుకున్నారు. పైరసీ వార్తతో షాక్‌ తిన్న చిత్ర బృందం ఆఘమేఘాలమీద సినిమాని సెప్టెంబర్‌ 27నే విడుదల చేసిన విషయం విదితమే. ఇప్పటికే టాలీవుడ్‌ చరిత్రలో వసూళ్ళ పరంగా నెంబర్‌ వన్‌ స్థానాన్ని ఆక్రమించుకున్న ‘అత్తారింటికి దారేది’ కొత్త సన్నివేశాలను చేర్చడం ద్వారా ఇంకెంతగా ప్రేక్షకుల్ని అలరిస్తుందో వేచి చూడాలి.